పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం..
1 min read– జిల్లా కలెక్టర్ గిరీష తో కలసి పాల్గొన్న ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యమని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రీ (బండ్లపెంట) దర్గాలో రూ 1.06 కోట్ల నిధులుతో అత్యాధునికంగా నిర్మించిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. అలాగే పట్టణంలోని కొత్తపేట రామాపురం, తిరుపతి నాయుడు కాలనీ లలో వేరువేరుగా జరిగిన వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రారంభ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ గిరీష తో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. వేదపండితుల పూజలు, ముస్లిం మత పెద్దల ప్రత్యేక ప్రార్థనల మధ్య ప్రారంభ కార్యక్రమాలు జరిగాయి.సయ్యద్ యూసుఫ్ షా ఖాద్రీ దర్గాలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాల్లో ప్రాధమిక ఆరోగ్య వ్యవస్థను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది తగినంత స్థాయిలో ఉన్నారన్నారు. రాయచోటి పట్టణంలో 4 డా వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్ లు మంజూరు అయ్యాయని, మొన్న ఒకటి, నేడు మూడు ప్రారంభించడం జరిగిందన్నారు. నాడు నేడు తో ప్రభుత్వాసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలులో మౌలిక వసతులను కల్పించడం జరుగుతోందన్నారు. పేదవానికి ఉచిత కార్పోరేట్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ మరింత పటిష్టం చేయడం జరుగుతుందన్నారు.పట్టణంలో నిర్మాణ దశలో ఉన్న వంద పడకల ఆసుపత్రి భవన నిర్మాణాలు మార్చి కల్లా పూర్తవుతాయన్నారు.ఆరోగ్య రంగంలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు.కళ్ళ ముందర అభివృద్ధి పనులు సాకారం అవుచుండడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ గిరీష మాట్లాడుతూ వైద్య రంగంలోరాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోందన్నారు. కార్పోరేట్ కు ధీటుగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలును నిర్మించడం జరుగుతోందన్నారు. వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.మొక్కలు నాటిన కలెక్టర్, ఎంఎల్ఎ లుకొత్తపల్లె వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్ర ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ గిరీషతో కలసి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి మొక్కలు నాటారు.ట్రాఫిక్ పోలీసు స్టేషన్ భవన నిర్మాణాలునుపరిశీలించిన ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీషలురాయచోటి పురపాలక సంఘం పరిధిలోని తిరుపతి నాయుడు కాలనీలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణ పనులను వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి,జిల్లా కలెక్టర్ గిరీష లు పరిశీలించారు.అలాగే కొత్తపేట రామాపురం నందు రూ 1.65 లక్షల నిధులుతో నిర్మితమవుతున్న కొత్తపేట రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులు, మౌలిక వసతుల నిర్మాణాలును ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీషలు పరిశీలించారు. మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, డి ఎం అండ్ హెచ్ ఓ కొండయ్య, మున్సిపల్ కమిషనర్ రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వండాడి వెంకటేశ్వర్లు, మదనపల్లె నియోజక వర్గ పరిశీలకులు హాబీబుల్లా ఖాన్, జమాల్ ఖాన్,అలీ నవాజ్ ఖాన్, బేపారి మహమ్మద్ ఖాన్, జెడ్ పి టి సి వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి,మండల బిసి నాయకుడు పల్లపు రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెన్నూరు అన్వర్ బాష, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్ రెడ్డి,నాగాంజలి,సబిత,జిల్లా వ్యవసాయ సలహా సభ్యుడు రవిరాజు,జయన్న నాయక్ నాయక్,ఆసీఫ్ అలీఖాన్,కొలిమీ ఛాన్ బాష,ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పబ్బిశెట్టి సురేష్ కుమార్, గౌస్ ఖాన్,జిన్నా షరీఫ్, అన్నా సలీం, సుగవాసి శ్యామ్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, జానం రవీంద్ర యాదవ్, జిల్లా వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్లు జాకీర్, నవరంగ్ నిస్సార్,మహేష్ రెడ్డి, షబ్బీర్, అల్తాఫ్,అయ్యవారు రెడ్డి,హజరత్ ఖాదర్ వలీ, వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు,విఆర్ విద్యా సంస్థల అధినేత వి ఆర్ రెడ్డి,వంశీ, శంకర్ రెడ్డి, రియాజ్,పల్లా రమేష్, భాస్కర్,మాజీ కౌన్సిలర్ ఆనంద రెడ్డి, ఆర్ట్స్ శంకర్, కొత్తపల్లె ఇంతియాజ్,మణికంటా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.