అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని సమర్పించుకున్న రోజు
1 min readపల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం నందు మండల తాసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కార్యాలయం నందు ఎంపీపీ నసురుద్దీన్, పోలీస్ స్టేషన్ నందు ఎస్సై తిమ్మారెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి నందు డాక్టర్ రఘు రామిరెడ్డి,వెలుగు శాఖ కార్యాలయం నందు హేమలత, వ్యవసాయ కార్యాలయం నందు రాజా కిషోర్, మండల విద్యా వనరుల కేంద్రం నందు మండల విద్యాధికారి వినోద్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు నాగభూషణం లు 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు గణతంత్ర దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గణం అనగా ఎన్నుకునే ప్రజలు తంత్రం అనగా యంత్రాంగం భారతీయులు అందరం శాసనం చేసుకొని మాకు మేము ప్రపంచంలోని అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని సమర్పించుకున్న రోజు అని ,జనవరి 26 , 1950. నేడు మన భారత దేశం సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా* అవతరించిన రోజు.మన ఈ రాజ్యాంగం ప్రకారం పౌరులు అందరూ సమానం. దేశ ప్రజలకు కులం, మతం, వర్గం, లింగ, జాతి భేదాలు లేకుండా అందరికీ సమాన హోదా వచ్చిన రోజు.మన దేశ అంతర్గత విషయాల్లో ప్రపంచంలోని ఏదేశం తల దూర్చకూడదు.దేశంలో ఆర్థిక అసమానతలు వుండకూడదు.భారత దేశం మత ప్రమేయం లేని రాజ్యంగా అన్నీ మతాల సమానత్వంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపిస్తుందని అన్నారు. అలాగే మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలల్లో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి, అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.