NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

RRR పై రెడ్ల సంఘం జేఏసీ ఫైర్​

1 min read
మాట్లాడుతున్న రాజావిష్ణువర్ధన్​ రెడ్డి

మాట్లాడుతున్న రాజావిష్ణువర్ధన్​ రెడ్డి

– రెడ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణం..
– రెడ్ల సంఘం రాష్ట్ర జేఏసీ కార్యదర్శి రాజా విష్ణువర్ధన్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కులాలపై విమర్శలు చేయడం సిగ్గు చేటని రెడ్ల సంఘం రాష్ట్ర జేఏసీ కార్యదర్శి రాజా విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ రెడ్డి ’ అంటే ఓ గ్రామానికి, ఊరికి అండగా ఉంటూ ప్రజలను రక్షించే స్థాయిలో ఉంటాడని, అటువంటి రెడ్లపై ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… ఎంపీ రఘురామకృష్ణరాజు వంటి వారితో ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై, రెడ్లపై రెచ్చగొట్టే మాటలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. మరోసారి రెడ్లను కించపరిచే విధంగా విమర్శలకు పాల్పడితే ఎంపీ రాఘురామకృష్ణరాజు ఇంటిని ముట్టడిస్తామని రెడ్ల సంఘం రాష్ట్ర జేఏసీ కార్యదర్శి రాజా విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

About Author