ఏరువాక పౌర్ణమి… సాంప్రదాయక ఎద్దుల ఊరేగింపు
1 min read

ఆదోని, న్యూస్ నేడు: ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో ఏరువాక పౌర్ణమి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన సాంప్రదాయక ఎద్దుల ఊరేగింపు కార్యక్రమం బుదవారం గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గ్రామానికి విచ్చేసి, గ్రామస్తులు అందరూ ఉత్సాహంగా పాల్గొన్న ఈ ఊరేగింపును తిలకించారు. ప్రకృతి పరంగా రైతులకు ఎంతో కీలకమైన ఈ పండుగను ప్రజలతో కలిసి జరుపుకోవడం ఆనందదాయకమని ఆయన అన్నారు.గ్రామీణ సాంప్రదాయాలకు చిరునామా లాంటి ఈ కార్యక్రమం, రైతుల కృషి పట్ల మనం చూపాల్సిన గౌరవాన్ని గుర్తు చేస్తుందని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఆయన గ్రామ పెద్దలతో మరియు రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు గ్రామంలోని జైన్ టెంపుల్, రామాలయం దేవాలయాలను దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాసీం, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


