PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సార్ టిడిపి వాళ్లను పార్టీలో ఎలా చేర్చుకుంటారు..?

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ పాల్గొన్నారు.ఈకార్యక్రమం రసాబాసగా సాగింది.వివిధ సమస్యలపై ఎమ్మెల్యేకు మహిళలు మరియు ప్రజలు ప్రశ్నల వర్షం కురిపించారు.సార్ టిడిపి వాళ్లను వైసీపీ పార్టీలోకి ఏ విధంగా చేర్చుకుంటారు పార్టీలో కష్టపడ్డ వారికి మీరు విలువ ఇవ్వడం లేదు.మేము పార్టీ కోసం ఎన్నికల సమయంలో చాలా కష్టపడ్డా మంటూ గ్రామానికి చెందిన కురువ రమ్య ఎమ్మెల్యేను నిలదీశారు.మాకు అందరూ కావాలని ఎమ్మెల్యే అన్నారు.మాజీ సర్పంచ్ చిక్కంటి శారదమ్మ మాట్లాడుతూ మాకు ఉన్న పొలాన్ని ఆన్లైన్లో ఎక్కించకుండా మీరు సంతకం చేయడం వల్లే మా పొలాన్ని ఆన్లైన్లో ఎక్కించడం లేదని అంతేకాకుండా ఎన్నికల సమయంలో మేము లక్షల రూపాయలు వెచ్చించి ఖర్చు చేసినా మాకు ఫలితం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.గోపాలం మధుబాబు అనే యువకుడు మాట్లాడుతూ నేను ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఆర్థర్ ఫోటోను గుండెపైన పెట్టుకున్నానని వైసీపీ కార్యకర్తగా ఏర్పడినా నేను రేకుల కుటుంబంలో నివసిస్తున్నారని ఎన్నిసార్లు సచివాలయంలో అర్జీ పెట్టుకున్నా ఇల్లు మంజూరు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే అక్కడున్న వెల్ఫేర్ అసిస్టెంట్ ను పిలిచి మీరు ఎందుకు ఇంటి స్థలం ఇప్పించలేదని వారు మీ దగ్గరికి వస్తే మంజూరు చేస్తారు రాకపోతే చెయ్యరా అంటూ,సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఉన్నారు కదా ఇంటి స్థలం మంజూరు చేయాలని మీకు తెలియదా అంటూ ఎమ్మెల్యే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దళిత కాలనీలో పురాతన బావిలో గతంలో ఇద్దరు చిన్నారులు చనిపోయారని వాటిని పూడించాలని గతంలో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని మహిళలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.ఆ బావి అవసరం లేకపోతే వెంటనే పూడిపించాలని ఎంపీడీవో,ఈఓఆర్డిని ఎమ్మెల్యే ఆదేశించారు.కుమ్మరి మల్లిక ఎంసీఏ చదువుతున్నానని గత రెండు సంవత్సరాలుగా మొత్తం లక్ష రూపాయలు రావాల్సి ఉన్న ఒక్క పైసా కూడా రాలేదని విద్యార్థి ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.అంతేకాకుండా గ్రామంలో ప్రభుత్వ భూములు అధికంగా ఉన్నాయని అసైన్డ్ భూమి రికార్డులను రెవెన్యూ అధికారులు తారుమారు చేసి నకిలీ పాస్ పుస్తకాలను సృష్టించి భూములు చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు.తర్వాత వివిధ సమస్యల పైన ప్రజలు ఎమ్మెల్యేకు ప్రజల తెలుపగా వాటికి సంబంధించిన అధికారులను పిలిచి ఎమ్మెల్యే అప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. చిట్టచివరగా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడుతూ నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే న్యాయం చేయండి అని అధికారులకు నేను చెబుతానే తప్ప ఎవరికీ కూడా నేను సపోర్ట్ చేయనని అన్నారు.మీరు చేసే తప్పుడు పనుల వల్ల మేము తిట్లు తినాల్సి వస్తుందని వీటిలో మాకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా మేము ప్రజలతో మాటలు పడాల్సి వస్తుందని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.మీదృష్టికి ఏమైనా సమస్యలు వస్తే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని అన్నారు.రేపు జలకనూరు గ్రామంలో మధ్యాహ్నం రెండు గంటలకు గడప గడప కార్యక్రమం జరుగుతుందని ఎమ్మెల్యే తెలియజేశారు.తర్వాత ఎమ్మెల్యేను సిఎస్ఐ సంఘ పెద్దలు శాలువా పులమాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,డిప్యూటీ తహసీల్దార్ రవణమ్మ, జూపాడుబంగ్లా ఎస్సై సి.వెంకటసుబ్బయ్య,ఎస్ఐ మారుతి శంకర్,సుంకేసుల గ్రామ నాయకులు ఈ.వెంకట్,పుల్లయ్య,షేక్ అబ్దుల్ షుకూర్,కడుమూరు గోవర్ధన్ రెడ్డి,వంగాల సిద్ధారెడ్డి,రఘురామయ్య, చంద్రశేఖర్ రెడ్డి,నడిపి నాగన్న,సాదిక్,ఇనాయతుల్లా మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author