“యాంటీ డ్రగ్ డ్రైవ్ “పై రెండవ విడత అవగాహన
1 min read– మాదక ద్రవ్యాలు( డ్రగ్స్) వలన విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకోవద్దు
– అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపీఎస్
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐ.పి.ఎస్., వారి ఆదేశాల ప్రకారం, జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు తమ-తమ పరిధిలో ఉన్న పాఠశాల/కాలేజీ విద్యార్ధిని, విద్యార్థులకు “యాంటీ డ్రగ్ డ్రైవ్ “పై రెండవ విడత అవగాహనా కార్యక్రమం తో పాటు హోర్డింగ్స్, ఫ్లెక్సి, పోస్టర్స్ ను ఏర్పాటు చేశారు. పాఠశాల/కాలేజీ విద్యార్ధిని, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా ఉండేందుకు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… డ్రగ్స్ వ్యసనం యువతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని, మత్తు పదార్థాలకు అలవాటుపడితే దుష్ఫలితాలు : నిద్రలేమి తీవ్ర ఆందోళన, విపరీత ధోరణి, మానసిక కుంగుబాటు, కళ్ళు తిరగటం, మత్తుగా ఉండటం, వణుకు, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శారీరక మానసిక స్థితిలో ఆకస్మిక మార్పులు, గందరగోళం, కంటి సమస్యలు, ఒంటరితనం, బరువు తగ్గటం, అధిక రక్తపోటు, గుండె వేగంలో హెచ్చుతగ్గులు, కోపం, చిరాకు, కొత్త స్నేహాలు, అత్యుత్సాహం, డ్రగ్స్ కోసం తపించటం, నేర ప్రవృత్తి, ఆకస్మిక మరణం తదితర దుష్పరిణాలు తలెత్తి జీవితమే నాశనమయ్యే ప్రమాదముంటుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ జోలికి వెళ్లరాదని అవగాహన కల్పించినారు.జిల్లా లో భాగా రద్దీగా ఉన్న ప్రదేశాలలో హోర్డింగ్ లను, గుర్తించబడిన కాలేజస్ వద్ద పోస్టర్స్ మరియు ఫ్లక్సి లను , బస్ స్టాప్ లు మార్కెట్స్ వద్ద పోస్టర్స్ ను ఏర్పాటు చేసి స్కూల్స్ మరియు కాలేజస్ వద్ద కరపత్రాలను అందజేయడమైనది అలాగే మీ పరిసర ప్రాంతాలు, విద్యాసంస్థలలో డ్రగ్స్ వినియోగించే వారి గురించి 14500 నెంబర్ కు సమాచారం అందజేయాలని సూచించారు అలా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యముగా వుంచబడునని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేసారు.