NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సంపూర్ణ ఆరోగ్యం.. యోగా తో సాధ్యం

1 min read

జిల్లా జడ్జి కబర్తి

జిల్లా కోర్టు ఆవరణలో.. యోగా దినోత్సవం

కర్నూలు, న్యూస్ నేడు : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి. కబర్థి  శనివారం జిల్లా కోర్టు ఆవరణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందిలతో నిర్వహించారు.  అనునిత్యం ఎదురయ్యే ఆటుపోట్లను అధికమించడానికి నిజజీవితంలో యోగా అవసరమని, యోగా వల్ల ప్రశాంతతోపాటు ఆరోగ్యానికి మంచిదని, యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి అవగాహన కల్పిస్తూ యోగా సాధన ద్వారా  ప్రతి వ్యక్తి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చు అనేది యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే అంతర్జాతీయంగా యోగా దినోత్సవ  ముఖ్య ఉద్దేశ్యం అని తెలియజేసారు. న్యాయ శాఖ ఉద్యోగి యోగా మాస్టర్ ముంతాజ్  ద్వారా అనునిత్యం చేసుకొనే కొన్ని యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, బార్ ప్రసిడెంట్ హరినాథ్ చౌదరి, న్యాయ వాదులు, న్యాయ శాఖ సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

About Author