NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీరానంద స్వామి గోశాలకి ఫ్యాన్లు…

1 min read

అందించిన స్ఫూర్తి సేవా సమితి

ప్యాపిలి, న్యూస్​ నేడు:  గోసేవ అత్యంత పుణ్యఫలమని, గోవులకి సేవ చేయడం వల్ల సకల దేవతలకు పూజలు చేసినట్లే అని ఉంగరాణిగుండ్ల సద్గురు శ్రీ వీరానంద స్వామి  అన్నారు. డోన్ పట్టణానికి చెందిన స్ఫూర్తి సేవా సమితి సభ్యులు గోసేవలో భాగంగా స్ఫూర్తి దాతల నుంచి సేకరించిన 16 వేల రూపాయల విలువ చేసే 8 ఫ్యాన్లను స్ఫూర్తి సభ్యులు వీరానంద స్వామి కి అందించారు. గోశాలలోని గోవుల సంరక్షణ కోరుకు అవసరమైన ఫ్యాన్లను అందించిన దాతలకు పేరు పేరున ధన్యవాదములు తెలుపుతూ, సేకరించి గోశాలకి అందించిన స్ఫూర్తి సభ్యులను స్వామి  అభినందించి ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి సభ్యులు గోవింద రెడ్డి , స్ఫూర్తి మధు, మోహన్ రెడ్డి, భాస్కర్, నారాయణ స్వామి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author