క్యూలైన్ల పరిశీలన
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల భాగంగా ఈఓ లవన్న క్యూలైన్లను మరియు క్షేత్రపరిధిలోని శౌచాలయాలను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.భాగంగా ఈ రోజు క్యూలైన్లు ఆలయప్రాంగణములోని ఏర్పాట్లు పరిశీలించాడు భక్తులకు క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకుగాను తగినస్థాయిలో సెక్యూరిటీ సిబ్బందిని మరియు శివసేవకులను ఏర్పాటు చేయనున్నారు. క్యూకాంప్లెక్స్ ఉండే భక్తులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు అందజేస్తారు.క్యూలైన్లలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు మరియు అత్యవసర సమయాలలో వినియోగించుకునేందుకు క్యూలైన్లలో ఏర్పాటు చేయబడిన అత్యవసర గేట్లు సజావుగా పనిచేసేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి సంబంధిత అధికారులు ఈఓ ఆదేశించారు క్షేత్రపరిధిలోని శౌచాలయాల శుభ్రతపట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. అన్నీ శౌచాలయాలలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం నీటిసరఫరా ఏర్పాటు చెయ్యనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు వేరు వేరుగ క్యూలైన్ల ద్వారా దర్శనాలను ఏర్పాట్లుఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.వీటితో పాటుగా పాదయాత్రతో వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం ఏర్పాటు చేస్తున్నారు జరుగుతుంది. ఈ పాదయాత్ర భక్తులకు అటవీమార్గమధ్యములోనే కంకణాలను వేయడం జరుగుతుంది. కంకణాలు ధరించిన పాదయాత్ర భక్తులనే ప్రత్యేక క్యూలైన్ ద్వారా పంపడం అదేవిధంగా శివదీక్షా భక్తులకు చంద్రవతి కల్యాణమండపం నుంచి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయబడుతుంది.అలాగే క్యూకాంప్లెక్స్ నందు మొత్తం 16 కంపార్టుమెంట్ల ద్వారా దర్శనానికి అవకాశం కల్పించబడుతోంది. అదేవిధంగా 6 కంపార్టుమెంట్ల ద్వారా భక్తులను శీఘ్రదర్శనం అనుమతించడం జరుగుతుంది. ఈ పరిశీలనలో ఆలయ అధికారులు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.