సమష్టి కృషితో…కరోనాను కట్టడి చేద్దాం..
1 min read– రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
పల్లెవెలుగు వెబ్, మహబూబ్నగర్ : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రజలు… అందరి సమష్టి కృషితో కరోనాను నియంత్రించగలమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ సహకారంతో 10 మల్టీ పారమీటర్స్ మరియు హై ఫ్లో నాజర్ పరికరాలు, 10 ఆక్సిజన్ మానిటర్ లను ఆస్పత్రి యజమాన్యాయానికి అందజేశారు. కరోనా నియంత్రణలో అనేకమంది స్వచ్ఛంద సంస్థలు,దాతలు,సేవకులు ముందుకు వస్తున్నారని, యువకులు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రాగా, జిల్లాకు చెందిన ఎం ఎస్ ఎన్ లాబరేటరీ వారు10 మల్టీ పారమీటర్స్ మరియు హై ఫ్లో నాజర్ పరికరాలను అందించడం సంతోషకరమన్నారు.
రూ.1999కే సిటీ స్కాన్.. : జిల్లాలోని 13 ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కరోన రోగులకు సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారని, ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం 20 శాతం పడకలను పేద రోగులకు అందించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా కేవలం 1999 రూపాయలకే సి టి స్కాన్ చేసేందుకు అనుమతించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డాక్టర్ రాం కిషన్ ,ఐ ఎం ఎ అధ్యక్షులు డాక్టర్ రామ్ మోహన్, డాక్టర్ జీవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.