మహానంది మండలంలో యూరియా కొరత లేదు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మండలంలోని గ్రామాల్లో యూరియా కొరత లేదని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర్ రెడ్డి తెలిపారు దాదాపు రెండు నెలల నుంచి రైతులకు అవసరమగు రసాయనిక ఎరువులను ముఖ్యంగా డీఏపీ మరియు యూరియా ను అందజేశామన్నారు. ఇప్పటికే మండలంలోని వివిధ గ్రామాల్లో వరి కరకు పొట్ట దశలో ఉన్నాయన్నారు. సాధారణంగా ఈ సమయంలో డిఎపి అవసరం ఉండదని తెలిపారు. రైతులు అవసరానికి మించి యూరియా వాడడం వల్ల మరియు యూరియా దొరుకుతుందో లేదో అనే ఉద్దేశంతో కొందరు రైతులు అవసరానికి మించి నిలువ చేసుకుంటున్నారని అపోహలు విడనాడి అవసరమైన మేరకు యూరియా రైతు భరోసా కేంద్రాల వద్ద తీసుకోవచ్చు అన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత రెండు నెలల కాలంలో యూరియా ఎరువులను సీతారామపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 149.85 మెట్రిక్ టన్నులు ( 3330 బ్యాగ్స్), మసీదుపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 64.935 మెట్రిక్ టన్నులు( 1443 బ్యాగ్స్ ), తిమ్మాపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 49.95 మెట్రిక్ టన్నులు( 1110 బ్యాగ్స్), గోపవరం రైతు భరోసా కేంద్రం ద్వారా 89.97 మెట్రిక్ టన్నులు ( 1998 బ్యాగ్స్) , అబ్బిపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 59.94 మెట్రిక్ టన్నులు ( 1332 బ్యాగ్స్), తమ్మడపల్లి రైతు భరోసా కేంద్రం ద్వారా 119.88 మెట్రిక్ టన్నులు ( 2664 బ్యాగ్స్), గాజులపల్లి రైతు భరోసా కేంద్రం ద్వారా 19.98 మెట్రిక్ టన్నులు ( 444 బ్యాగ్స్) , బుక్కాపురం రైతు భరోసా కేంద్రం ద్వారా 59.985 మెట్రిక్ టన్నులు ( 1333 బ్యాగ్స్), బొల్లవరం రైతు భరోసా కేంద్రం ద్వారా 104.895 మెట్రిక్ టన్నులు( 2331 బ్యాగ్స్) రైతులకు అందజేయడం జరిగినది. *మొత్తం మహానంది మండలానికి గత రెండు నెలల కాలంలోనే 719.325 మెట్రిక్ టన్నులు( 15985 బ్యాగ్స్) యూరియా ఎరువులను రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పంపిణీ చేయడం జరిగినది. అన్నారు.