PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహాశివరాత్రి పురస్కరించుకొని పటిష్టమైన బందోబస్తు

1 min read

– క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ,అధికారులకు ఆదేశాలు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ముసునూరు మండలం లో వెంచేసి ఉన్న బలివే పుణ్యక్షేత్రంలో ఈనెల 18 వ తేది నాడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తజనానికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులందరికీ దైవ దర్శనం కలిగేలాగా పటిష్టమైన ఏర్పాట్లను గురించి ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి సదరు బలివే పుణ్యక్షేత్రంలో ఉన్న శివాలయం ఏర్పాటు చేసిన మూడు రకాల క్యూ లైన్ ల వద్ద భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేయవలసిన బారికేడ్లను గురించి అధికారులకు తగిన సూచనలు మరియు సలహాలను జిల్లా ఎస్పీ ఇచ్చినారు, జంగారెడ్డిగూడెం వైపు నుంచి ఏలూరు వైపు నుంచి బలివే క్షేత్రానికి వచ్చే వాహనాల పార్కింగ్ స్థలాన్ని మరియు ముసునూరు నూజివీడు వైపు నుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అక్కడ ఏర్పాటు చేయవలసిన బందోబస్తు గురించి అధికారులకు తగిన సూచనలు చేసినారు, ఎంతో ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రమైన బలివే తీర్థానికి జన సందోహానీ కి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా పుణ్యక్షేత్రంలో తీర్థములను సాఫీగా సాగేలాగా పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేయాలని సూచించారు, బందోబస్తు రూపకల్పన కొరకు అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుని బందోబస్తును రూపకల్పన చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చినారు. జిల్లా ఎస్పీ తో పాటుగా నూజివీడు డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్ , ఎస్బి ఇన్స్పెక్టర్ వి రవికుమార్ , పెదవేగి ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్ , పెదవేగి ఎస్ఐ లక్ష్మణ , ముసునూరు ఎస్సై కుటుంబరావు , ముసునూరు గ్రామ సర్పంచ్ , మరియు బలివే తీర్థం దేవాలయం యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author