PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సజావుగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్ల లోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమావేశ భవనం నందు శుక్రవారం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు టి నసురుద్దీన్ అధ్యక్షతన నిర్వహించారు. ముందుగా మండల అధ్యక్షులు నసురుద్దీన్ మాట్లాడుతూ గత సమావేశం నుండి నేటి వరకు మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కరుగా వచ్చి వివరించాలని మండల అధికారులను ఆదేశించారు.ముందుగా మండల వ్యవసాయ అధికారి రాజా కిషోర్ మాట్లాడుతూ మండలంలో 4539 మంది రైతులు పీకేవైసీ చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం హౌసింగ్ ఏఈ లక్ష్మన్న మాట్లాడుతూ మండలంలో జగనన్న కాలనీలో జరిగిన అభివృద్ధి వసతులు గురించి ఆయన వివరించారు. అలాగే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు మండలంలో 1222 మంజూరు కాగా 213 ఇల్లు పూర్తయ్యాయని, 1009 ఇండ్లు వివిధ దశల్లో నిర్మాణాలు జరుగుతున్నాయని, వచ్చే ఉగాది పండుగ నాటికి మండలంలో 422 ఇండ్లను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారని, అయితే 419 ఇళ్లను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.అర్హులైన వాళ్లు నిర్ణీత సమయంలో ఇల్ల నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. అలాగే ప్రతి శనివారం హౌసింగ్ సమస్యల పరిస్కరంకై హౌసింగ్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జలజీవన్ పథకం ద్వారా ముత్తు అనుమతులు రాగానే గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయిల పనులు ప్రారంభిస్తామన్నారు.ఈ సమయంలో ఎంపీపీ నాసురుద్దీన్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తో మాట్లాడుతూ వచ్చే వేసవికాలంలో మండలంలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం వైద్యదికారి డాక్టర్ రజిని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన విధానం ఫ్యామిలీ విజిటింగ్ ప్రోగ్రాంలో ప్రతి పీహెచ్ కి ఇద్దరు డాక్టర్లను నియమించిందని వీరిలో ఒకరు 104 ద్వారా ప్రతిరోజు ఒక గ్రామ సచివాలయం గ్రామంలో విసిటింగ్ చేస్తారని మరో డాక్టర్ పి హెచ్ సి లో ఉండి రోగులను పరీక్షిస్తారని తెలిపారు.అనంతరం స్త్రి శిశు సంక్షేమ శాఖ పత్తికొండ ప్రాజెక్టు పరిధిలోని గోనెగండ్ల సూపర్వైజర్ నాగేశ్వరమ్మ మాట్లాడుతూ మండలంలో 68 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని, 68 మంది అంగన్వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారని, 68 అంగన్వాడి కేంద్రాలలో 67 కేంద్రాలలో ఆయాలు పనిచేస్తున్నారని అన్నారు. వీరు అంగన్వాడి కేంద్రం నందు గర్భవతులకు బాలింతలకు పౌష్టికాహారం పెట్టడం మరియు మూడు నుండి ఐదు సంవత్సరాల్లో పిల్లలకు పౌష్టికాహారంతో నిండిన భోజనం అందించడం జరుగుతుందని అన్నారు.అలాగే మండలంలో లేదా గ్రామంలో ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరము లు నిండిన తర్వాతనే పెళ్లిళ్లు చేయాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే అలాంటి అంగన్వాడీ కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం మండల విద్యాధికారి వినోద్ కుమార్ మాట్లాడుతూ హెచ్ కైరవాడి గ్రామంలో ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అన్నారు అలాగే నాడు నేడు కింద పాఠశాలలో పనులు జరుగుతున్నాయని వాటిని పూర్తిచేస్తామని అలాగే ఈ సంవత్సరం మండలంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ ఈ సమయంలో ఎంపీడీవో స్పందించి మాట్లాడుతూ మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల ఇండ్లను సందర్శించి వారి తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో మాట్లాడడం జరుగుతుందని ఇది అభినందించదగ్గ విషయమని అన్నారు. అనంతరం పిఓపి ఆర్ డి నాగేష్ మాట్లాడుతూ సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శుల సమన్వయంతో ఉండాలని అలాగే ఇంటి పన్నులు కులాయి పన్నులు ప్రజలు సకాలంలో కట్టే విధంగా కృషి చేయాలని అన్నారు,.అనంతరం పిఆర్ఏఈ శివశంకర్ మాట్లాడుతూ మండలంలో బీటీ రోడ్లు కు అనుమతులు వచ్చాయని అల్వాల నుండి బెలగల్ వరకు అయ్య కొండ నుండి కడిమెట్ల వరకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. అనంతరం పశువైద్యుడు అక్బర్ మాట్లాడుతూ మండలంలో సంచార పశు వైద్య అంబులెన్స్ వచ్చిందని ఈ అంబులెన్స్ ను పశువులు ఉన్న రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మాజీ కోఆప్షన్ మెంబర్ స్పందనవాజ్ మాట్లాడుతూ గ్రామంలో పశువులు కోతులు మరియు కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయని అవి మనుషులపై దాడికి దిగుతున్నాయని వాటిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సకాలంలో విధులకు హాజరై ప్రజలకు సేవలు అందించాలని విధుల పట్ల నిర్లక్ష్యం వహించినప్పుడే గ్రామస్థాయి ప్రజలు మండలంలోని అధికారులను కలవడానికి వస్తారని గ్రామంలో సస్టైనబుల్ సర్వే జరుగుతుందని ఈ సర్వేలో గర్భవతుల హెల్త్ సమస్యలపై అలాగే ఐదు సంవత్సరాల లోపు పిల్లల ఆధార్ హెల్త్ సమస్యలపై మరియు ఆరు సంవత్సరాల నుండి 19 సంవత్సరాల లోపు పిల్లల ఆరోగ్య విషయాలపై సర్వే జరుగుతుందని ఇందులో ఏఎన్ఎం పంచాయతీ కార్యదర్శి ఆశలు అంగన్వాడీ కార్యకర్త అందరూ సమన్వయంతో చేయాలని సూచించారు. అలాగే 10వ తరగతి పరీక్షలు జరుగుతుండడంతో పాఠశాలల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని అన్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ ఈనెల 25 నుండి మూడు రోజులపాటు గంజహళ్లి గ్రామంలో మహాత్మ బడే సాహెబ్ తాత కృషి జరుగుతున్న సందర్భంగా గ్రామంలో భక్తులకు ఎలాంటి నీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ రవుఫ్, మాజీ కోఆప్షన్ నెంబర్ బందే నవాజ్ , వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author