గోదా గోకులం ఆలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోతుంది
1 min read– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పవిత్ర తుంగభద్రా నది సమీపంలో నిర్మిస్తున్న గోదా గోకులం ఆలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు .ఈ వేరకు నగరంలోని సుంకేసుల రహదారిలో నిర్మించిన గోదా గోకులంలో జరగనున్న వివిధ విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో జరుగుతున్న ముందస్తు పూజా కార్యక్రమాలలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులతో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. గోదా గోకులం ఆలయంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న శ్రీ త్రిదిండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో రాజ్యసభ మాజీ సందర్భంగా సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయంలో ప్రతిష్ట చేయు చేయనున్న విగ్రహాలను గురించి శ్రీ త్రిదిండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులకు వివరించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులను శాలువా కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. గోదా గోకులంలో విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో జరుగుతున్న ముందస్తు పూజా కార్యక్రమాలతో ఆలయం తో పాటు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణమ్ వెళ్లి విరిసింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ శ్రీ త్రిదిండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో గోదా గోకులంలో విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తుంగభద్రా నదీతీరంలో నిర్మించిన గోదా గోకులం ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి, గోదాదేవి ,లక్ష్మీదేవి, నరసింహ స్వామి వంటి దేవతా విగ్రహాల ప్రతిష్ట నేపథ్యం లో ఈ ఆలయం ప్రతిష్ట పొందుతుందని చెప్పారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు .పూర్వజన్మ సుకృతం వల్లే ఇలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. ఇలాంటి మంచి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత జన్మలో మనం చేసే మంచి పనులే వచ్చే జన్మలో మన పుట్టుకను నిర్దేశిస్తాయని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేసేలా భగవంతుని ఆశీస్సులు కోరుకోవాలని అన్నారు . అనంతరం శ్రీ త్రిదిండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ గోదా గోకులం ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులతో పాటు ఆయన తనయుడు యువనేత టీజీ భరత్ పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు .గోదా గోకులంలో శ్రీ రంగనాథ గోదా సమేత శ్రీ రంగనాథ పెరుమాళ్ సుదర్శన గరుడ అల్వాచారుల దేవతా విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు వివరించారు. మార్చి 1వ తేదీ దేవతా విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం ఉంటుందని, అనంతరం రెండవ తేదీ శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకొని సమాజానికి పాటుపడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాగరాజు గుప్తా,సుబ్రమణ్యం,లక్ష్మీ నారాయణ,మారం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.