రూ. 3 కోట్ల 50 లక్షల విలువ గల మొబైల్ ఫోన్ల రికవరి
1 min read– బాధితులకు అందజేసిన .. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఇప్పటివరకు మొత్తం 5,727 (విలువ రూ. 12 కోట్లు ) పొగోట్టుకున్న మొబైల్ ఫోన్లను ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి రికవరి చేసి భాధితులకు అందజేశాం.మొదటి విడత లో 653(1.2 కోట్లు) రెండవ విడతలో 1,064 (2.8 కోట్లు), మూడవ విడతలో 2,086 (2.5 కోట్లు), 4 వ విడతలో రికవరీ చేసిన 1,924( రూ. 3 కోట్ల 50 లక్షలు) )జిల్లా పోలీసు కార్యాలయంలో “ మొబైల్ రికవరీ మేళా ” కార్యక్రమం.ఉత్తర ప్రదేశ్, కేరళ, మహరాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బీహార్, రాజస్ధాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం తో ఆనందం వ్యక్తం చేసిన బాధితులు.మొబైల్ ఫోన్ పోతే … మీ సేవా కేంద్రాల కు వెళ్ళి గాని, లేదా http://Kurnoolpolice.in/mobiletheft లింకు ను క్లిక్ చేసి మొబైల్ వివరాలను తెలియజేస్తే బాధితులకు త్వరితగతిన అందజేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే నాలగవ విడతలో భాగంగా వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 1,924 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు ఆదివారం బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 1,924 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు, డిజిపి గారి ఆదేశాల మేరకు మొబైల్ రికవరీ మేళా నిర్వహించామన్నారు. ప్రపంచంలోని ఏక్కడి నుండైనా కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి పోయిన మొబైల్ ఫోన్ వివరాలు, సమాచారం అందించాలన్నారు . సహాయ సహాకారాలు అందించడానికి సంకల్పంతో పని చేస్తామన్నారు.కర్నూలు పోలీసుల సేవలను అందరూ ఇతరులకు కూడా తెలియజేయాలన్నారు.కర్నూలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే కాకుండా దేశంలోనే ఏ రాష్ట్రాలలోని వారికి కూడా మా పోలీసు సేవలు అందిస్తామన్నారు. ఇంతకు ముందు మొబైల్స్ పోగోట్టుకున్న వారు పోలీస్టేషన్లకు వెళ్ళడం , ఎఫ్ ఐ ఆర్ లు, కోర్టు చుట్టూ తిరిగడం, మీ సేవలకు వెళ్ళడం చాలా కష్టాలు ఉండేవన్నారు. ఇప్పుడు ఉన్న చోటు నుండే సులభంగా కర్నూలు పోలీసు వెబ్ సైట్ వెళ్ళి పోలీసు సేవలు పొందవచ్చన్నారు. సులభతరమైన పధ్ధతిలో కర్నూలుపోలీసు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ ను ఏర్పాటు చేశామన్నారు. మొబైల్ ఫోన్లను రికవరీ చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నామని, కర్నూలు పోలీసుల పై అందరికి ఒక నమ్మకం వచ్చిందన్నారు. ప్రజలకు మంచి సేవలందించేందుకు సైబర్ టీమ్ , ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు మొబైల్ ట్రాకింగ్ పై బాగా పని చేస్తున్నారన్నారు. ప్రజలకు కూడా కర్నూలు పోలీసుసేవల పై అవగాహన కల్పించడానికి మిడియా వారు చాలా సహాకారం అందిస్తున్నారన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ( బాపట్ల, విశాఖపట్టణం,కృష్ణా, గుంటూరు, అనంతపురం, కడప, మరియు నంద్యాల) మాత్రమే కాకుండా ఉత్తర ప్రదేశ్, కేరళ, మహరాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, బీహార్, రాజస్ధాన్, తెలంగాణ, రాష్ట్రాల నుండి కూడా బాధితులు పొగోట్టుకున్న మొబైల్ ఫోన్లను రీకవరీ చేసి ఇవ్వడం జరిగిందన్నారు. ఏవరైనా మొబైల్ ఫోన్ పోగోట్టుకుంటే కర్నూలు ( http://Kurnoolpolice.in/mobiletheft ) పోలీసు మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ వెబ్ సైట్ కి వెళ్ళి మొబైల్ ఫోన్ వివరాలు అందించవచ్చన్నారు.దాని పై వెంటనే సైబర్ ల్యాబ్ బృందం ట్రేస్ చేస్తూ బాధితులకు మొబైల్స్ అందజేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 5 వేల 7 వందల మొబైల్ ఫోన్లను భాధితులకు రికవరీ చేసి అందజేయడం జరిగిందన్నారు.ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి కూడా సెల్ ఫోన్ పొగోట్టుకున్న బాధితుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఏలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కూడా కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి పొగోట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ పోన్ రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. పర్సనల్ సమాచారం, జ్ఞాపకాలు, ఎన్నో మొబైల్ లో ఉంటాయని సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని, జిల్లా ఎస్పీ గారికి, కర్నూలు పోలీసులకు సెల్ పోన్లు పొందిన లబ్ధి దారులు , బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.
గుంటూరు బస్టాండ్ ఫ్లాట్ ఫాం దగ్గర మొబైల్ పొగొట్టుకున్నాను. ఇప్పుడున్న రోజుల్లో ఫోయిన ఫోన్ దొరకడం చాలా కష్టం, కర్నూలు జిల్లా మాత్రమే కాకుండా , ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి పోగోట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని, జిల్లా ఎస్పీ గారికి, సైబర్ ల్యాబ్, జిల్లా పోలీసులకు హ్యాట్సాఫ్ అంటూ తెలిపారు.కర్నూలు శ్రీ చైతన్య కళాశాల లో ఫస్ట్ ఇయర్ చదువు తున్నాను. నా TAB (ట్యాబ్) పోయి 3 నెలలు అయింది. సోషల్ మీడియా లో చూసి కర్నూలు పోలీసు వెబెసైట్ లో ఫిర్యాదు చేశాము . నా ట్యాబ్ తిరిగి నాకు చేరడం ఆనందంగా ఉందని కర్నూలు పోలీసు సేవలు అభినందనీయం.
http://Kurnoolpolice.in/mobiletheft ఈ లింకు ను క్లిక్ చేసి ఆ వివరాలను సమర్పించండి. మీ మొబైలు ను తిరిగి పొందండి.ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మొబైల్ LOST కాలమ్ నందు ఈ క్రింది వివరాలను మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి ,మీ మొబైలు కు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు , మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /alternate కాంటాక్ట్ వివరాలు సబ్ మిట్ చేయాలి.ఈ విధంగా మీరు ఫిర్యాదు చేసినచో పోలీస్ వారు మీ మొబైలు ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ గారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
2) మీ – సేవా నందు ఎలా అప్లై చేయాలి.
బాధితులు తమకు దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రింది వివరాలు అందించినట్లయితే మీ మొబైల్ ను పోలీసు వారు తిరిగి ఇప్పించటం కోసం ఈ క్రింది వివరాలను మీరు మీ -సేవా నందు ఇవ్వవలిసి ఉంటుంది.
• మీరు పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ వివరాలు ,
• మీరు పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్ యొక్క IMEI వివరాలు .
• మీరు పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన మొబైలు నెంబర్ వివరాలు
• మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్ , చిరునామా ,పేరు మొదలగు వివరాలు మిమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నెంబర్ మరియు alternate కాంటాక్ట్ వివరాలు ఈ వివరాలు మీరు మీ-సేవా నందు సమర్పించి Missing /lost articles రుసుము ను చెల్లించి , సదరు మీ-సేవా రసీదును తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఇవ్వవలెను .ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి, సిఐ లు శ్రీనివాసులు, శంకరయ్య, అబ్దుల్ గౌస్, తిమ్మారెడ్డి, ఆర్ ఐ లు పోతురాజు, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం ఎస్సై వేణుగోపాల్, ఆర్ ఎస్సై రమేష్, సైబర్ ల్యాబ్ సిబ్బంది ఉన్నారు.