ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రద్దు..!
1 min readపల్లెవెలుగు వెబ్: ఏపీ పరిషత్ ఎన్నికల మీద హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎమ్పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించలేదని హైకోర్టు పేర్కొంది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కు నాలుగు వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని .. కానీ ఎన్నికల సంఘం ఆ మార్గదర్శకాలు పాటించలేదని పేర్కొంది. ఏపీలో మళ్లీ ఎమ్పీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని తీర్పు వెలువరించింది. ఏపీలో ఈఏడాది ఏప్రిల్ 1న ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి… ఏప్రిల్ 7న పోలింగ్ నిర్వహించారు. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కు నాలుగు వారాల ముందు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.