విద్యార్థులు స్థానికంగా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సులనే ఎన్నుకోవాలి
1 min read– రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడి.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులు ఉద్యోగ అవకాశాలున్న కోర్సులను ఎంపిక చేసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు బి. తాండ్రపాడు గ్రామం వద్ద ఉన్న క్రీడో పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీలక్ష్మి క్రీడో పాఠశాల కు చెందిన మాధవి లత, సావిత్రి ,కార్తీక్ నాయుడు, చలం, లక్ష్మి ,శ్రావ్య ,వంశి, వెంకటరమణ, శ్రీ లలితా పీఠం పీఠాధిపతి మేడాసుబ్రహ్మణ్యం, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ అధ్యక్షుడు మల్లు వెంకట రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ప్రపంచంలో జరుగుతున్న అంశాలపై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రతి విద్యార్థి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు రొటీన్ కోర్సులు కాకుండా ఉపాధి ఉద్యోగాలకు అవకాశం ఉన్న కోర్సులు ఎంచుకోవడం ద్వారా జీవితంలో స్థిరపడే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పారు. కర్నూల్ ప్రాంతంలో ఉన్న తమ పరిశ్రమలకు సంబంధించి కెమికల్ విభాగంలో చదివిన వారి కి అవకాశాలు ఉన్నాయని, కానీ ఈ ప్రాంతంలో అలాంటి కోర్సులు చదివిన వారు కనిపించడం లేదన్నారు. కర్నూల్ ప్రాంతంలో డిఫెన్స్ ఎక్విప్మెంట్ పరిశ్రమ, సోలార్ పరిశ్రమలతో పాటు మరెన్నో పరిశ్రమలు వస్తున్నాయని, వాటిని గుర్తుంచుకొని అందుకు అవసరమైన కోర్సులను ఎంచుకొని చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. మారిన పరిస్థితుల్లో కులవృత్తులు కూడా ప్రాధాన్యతను కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.విధ్యార్టులకు మెరుగైన విద్యను అందిస్తున్న శ్రీ లక్ష్మీ పాటశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ విద్యార్థులకు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన నేపథ్యంపై విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు స్టేజి పైకి వచ్చిన విద్యార్థులకు ఆయన నగదు ప్రోత్సాహకాలను అందజేసి అభినందించారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండి జీవితంలో చేరుకోవలసిన లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణ అంకితభావంతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు .కర్నూలు నగరంలో కుల మతాలు రాజకీయాలకతీతంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు. అన్ని రంగాలలో రాణించిన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తో పాటు ఇతర అతిధులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది.