సహాయ నిరాకరణ… పోలీసుల వింత వైఖరి
1 min read– పాత్రికేయులకు సమాచారం నిల్
పల్లెవెలుగు వెబ్ పాణ్యం: సమాజంలో జరిగే మంచి చెడులను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే పాత్రికేయులకు పోలీసు వ్యవస్థ నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది పాణ్యం సర్కిల్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన ఎఫ్ఐఆర్ నమోదైన వాటి సమాచారం గుట్టుగా పెడుతుండడంతో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో రోజు స్టేషన్ కి వెళ్ళిన పాత్రికేయులకు సమాచారం ఇవ్వడం లేదని సాటి జర్నలిస్టులు వాపోతున్నారు ప్రత్యేకంగా పోలీస్ ప్రెస్ గ్రూపులో ప్రతిరోజు పాత్రికేయులకు కేసుల సమాచారం ఇచ్చే పోలీసులు కనీసం స్పందించడం లేదని కానీ కేసులు మాత్రం నమోదు అవుతున్నాయని వీటి అంతర్యం ఏమిటో తెలియక ఉన్నతాధికారులకు తెలిపిన కనీసం స్పందనలేదని కొద్దిమంది పాత్రికేయ మిత్రులకే సమాచారం ఇస్తున్నారని ఇప్పటికైనా అధికారులు కేసుల వివరాలు బహిరంగంగా తెలిపే జర్నలిస్టు వ్యవస్థను పునరుద్ధరించాలని కోరుతున్నారు.