ఎస్సీ ఎస్టీల అభివృద్ధి వైసీపీ తోనే సాధ్యం
1 min read– ఎస్సి ఎస్టీ లకు వార్షిక బడ్జెట్ లో రూ. 10,812 కోట్లు కేటాయింపు
– ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దిలీప్ రాజు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో వెనుకబడిన కులాలకు, అణగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మాంటింగ్ కమిటీ సభ్యులు దిలీప్ రాజు అన్నారు.గురువారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2023-2024 వ వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధులు కేటాయించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్సీపీ పార్టీలో ఎస్సీ ఎస్టీలకు మంచి సముచిత స్థానం ఇచ్చిందన్నారు. ఈసారి బడ్జెట్లో కేటాయించిన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు ఉపాధి కల్పనగా నిరుద్యోగులకు ఆసరాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం .గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో అన్ని వర్గాల కార్పొరేషన్ లకు నిధులు కేటాయించారన్నారు. విద్యా వ్యవస్థకు , వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండే ప్రభుత్వం వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే అని తెలిపారు.