జగనన్న గోరుముద్ద పథకం మెనూలో రాగిజావ మరో పోషకాహారం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఏపీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న గోరుముద్ద పథకం లో మెనూలో రాగిజావ ను చేర్చిన సందర్భంగా కర్నూలు నగరం 1వ వార్డు లో చిదంబర రావు వీధిలో గల నగరపాలక సంస్థ నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన జగనన్న గోరుముద్ద పథకం కార్యక్రమంనకు ముఖ్యఅతిథిగా వార్డు కార్పొరేటర్ P.షాషావలి పాల్గొని రాగిజావ ను విద్యార్థులకు వడ్డించి ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.Y.S.జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఖాజానపై ఆర్థిక భారం పడిననూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించే సదుద్దేశంతో బలవర్ధకమైన రాగిజావను జగనన్న గోరుముద్ద ఆహార పట్టికలో చేర్చి వారానికి 3 రోజులు విద్యార్థులకు అందించడం జరిగినది.ఈ పథకం ద్వారా రాష్ట్రంలో దాదాపు 38 లక్షల విద్యార్థులకు లబ్దిపొందుతున్నందుకు గాను CM గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్కూల్ HM శ్రీనివాసరావు గారు విద్యా కమిటీ చైర్ పర్సన్ పద్మ గారు,సచివాలయం డిజిటల్ సెక్రటరీ జిలాని బాష గారు,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.