రంజాన్ ప్రత్యేకం హలీం: మోమిన్ షబాన
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ప్రత్యేకంగా హలీం తయారు చేస్తారని 30 రోజులపాటు కటోరమైనా ఉపవాస దీక్షలు కొనసాగుతాయని తెలంగాణ మైనార్టీ మోర్చా ఇంచార్జ్ మోమిన్ షబానా అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటుచేసిన హలీం సెంటర్ ను మోమిన్ షబానా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసంలో తయారు చేసే హలీం ముస్లిం సోదరులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడతారని ఆమె తెలిపారు. హలీం తినడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఆత్మకూరు పట్టణంలో 30 రోజులపాటు ఈ హలీం తయారు చేస్తారని అన్నారు.