శ్రీ నూకాలమ్మ 59 వ వార్షికోత్సవం.. భారీ అన్న సమారాధన
1 min read– తపన ఫౌండేషన్ ద్వారా 15 సంవత్సరాలగా సేవా కార్యక్రమాలు..
– వ్యవస్థాపక అధ్యక్షులు గారపాటి సీత రామాంజనేయ చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి 59వ వార్షిక జాతర మహోత్సవాలలో శుక్రవారం తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు, బిజెపి నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించేందుకు గారపాటి సీతారామాంజనేయ చౌదరి విచ్చేయగా ఆలయకమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ (పండు), వెంకట రామలక్ష్మి దంపతులు,వీరంపాలెం శ్రీబాలా త్రిపురసుందరీ పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బంగారు శివలక్ష్మి, పీసుపాటి రామలక్ష్మి, ప్రధానార్చకులు యర్రమిల్లి మనోజ్ శర్మ ,రాజేష్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం అందించారు. ముందుగా గారపాటి చౌదరి 1964 నుండి కొలువైయున్న అమ్మవారిని దర్శించారు. అనంతరం శ్రీ నూకాలమ్మ అమ్మవారిని దర్శించి శ్రీ చక్రార్చనలో పాల్గొన్నారు. అనంతరం ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని గారపాటి చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాధ రావు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి కృష్ణ,ముత్యాలమ్మ ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గారపాటి చౌదరి మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారిని దర్శించడం, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నా అని 2008 లో ప్రారంభమైన తపన ఫౌండేషన్ ద్వారా గత 15 సంవత్సరాలుగా చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను మరింతగా జిల్లా వ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు.