ఒకరి రక్తం దానం.. ఆపదలో ఉన్న ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు..
1 min read– రైతులు ముందుకు వచ్చి రక్తదానం చెయ్యడం అభినందనీయం..
– జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
పల్లెవెలుగు వెబ్ భీమవరం : శనివారం భీమవరంలో టౌన్ హాల్ సమావేశ మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ , జిల్లా వ్యవసాయ శాఖ , ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త దానం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సిబ్బంది రైతులు రక్త దానం ఇచ్చేందుకు ముందుకు రావడం మంచి శుభ పరిమాణం అని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ రక్తాన్ని తయారు చేయలేము కావున రక్తదానం చేయడం తప్ప దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని ఆమె అన్నారు. దేశంలో ప్రతి ఏటా 80 లక్షలు యూనిట్లు, రాష్ట్రంలో 10 లక్షలు యూనిట్లు పైగా రక్తం కొరత ఉందన్నారు. ఒక్కరి రక్త దానం ప్లాస్మా , ఎర్ర రక్తకణాలు, ప్లేట్ లేట్స్ మూడు భాగాలు విభజించి ఆపదలో ఉన్న ముగ్గురుని ప్రాణాలు కాపాడుకోవచ్చునని అన్నారు. రోడ్డు ప్రమాదాలు , సర్జరీలు , శిశుజన్మములు మొదలైన సందర్భాలతో పాటుగా హేమో ఫిలియా, తలస్సేమియా, రక్తహీనతకలవారు, క్యాన్సర్ పేషెంట్లకు రక్తం చాలా అవసరమని. నిజ జీవితంలో మనం కూడా రక్తం కొరకు చాలా ఇబ్బంది పడ్డ సంఘటనలు ఉన్నాయని ఆమె అన్నారు. రక్త దానం చేసి ప్రాణ దాతలుగా సమాజంలో నిలిచి మరి కొందరికి స్ఫూర్తి గా ఉందామని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ రోజు రక్తదానం చేసిన 300 మంది రక్తదానం చేస్తున్నారని వారు 900 మంది ప్రాణాలను కాపాడినట్లు అవుతుందని కలెక్టర్ అన్నారు. రక్తదానం చేసిన వారికి పండ్లను , ప్రశంసా పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు , ఆర్ డి వో దాసి రాజు, డి యం హెచ్ వో డాక్టర్ బి. మహేశ్వరరావు, , తహశీల్దారు వై.రవి కుమార్, ఐ ఆర్ సి యస్ ఛైర్మన్ డాక్టర్ యం యస్ వి శివ రామ భద్రి రాజు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ అధికారుల సంఘం అధ్యక్షులు, కార్యదర్శి వ్యవసాయ శాఖ అధికారులు, భీమవరం మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ , ఎంపీడీవో, రైతులు , వ్యవసాయ శాఖ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.