దాతలు, మీడియా సహకారంతో ఆలయ అభివృద్ధి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: దాతలు మరియు మీడియా సహకారంతో మహానంది దేవస్థానం అభివృద్ధి చెందుతుందని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆదివారం మహానందిలో పేర్కొన్నారు. ఒక కోటి 60 లక్షల రూపాయలతో టిటిడి నిధులతో భక్తులకు అవసరమగు పది వసతి గృహాలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 4 కోట్ల 80 లక్షల రూపాయలతో వసతి గృహాల నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు తెలిపారు. మొదటి విడతలో కోటి 20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. దాతల సహకారంతో మరో 50 గదులు నిర్మాణానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో మహానంది దేవస్థానానికి సంబంధించి నిధుల నిల్వలు కేవలం 65 లక్షల రూపాయలు మాత్రమే ఉండేవని ప్రస్తుతం 8 కోట్ల 80 లక్షల రూపాయలకు చేరింది అన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు మరియు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కాంపోజిషన్ మొత్తాన్ని కూడా చెల్లించామని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు నూతన పిఆర్సిని త్వరలో అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించారు. మహానంది క్షేత్రంలోని కోనేరులు అభివృద్ధి కొరకు నెలలోపు పనులు ప్రారంభిస్తామన్నారు. భక్తుల సూచనల మేరకు రాహు కేతు పూజ నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొంత భాగాన్ని పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కే మహేశ్వర్ రెడ్డి ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి ఎంపీపీ ఎస్ఎస్పి ని తాసిల్దార్ జనార్ధన్ శెట్టి ఏఈఓ మధు పాలక మండల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.