సెక్యూరిటీ గార్డ్స్ కి జీతాలు ఇవ్వాలని ర్యాలీ
1 min read– ప్రభుత్వ జనరల్ హాస్పటల్ సెక్యూరిటీ గార్డ్స్ పెండింగ్ జీతాలు ఇవ్వకుండా కార్మికుల కుటుంబాలను పస్తులు ఉంచుతున్న ఎక్స్పర్ట్ ఏజెన్సీ సిఐటియు ధర్నా కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు ఇవ్వాలని రెండవ రోజు డ్యూటీ పాయింట్ నుండి ర్యాలీగా వెళ్లి హాస్పిటల్ గాంధీ విగ్రహం ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు బాల తిమ్మయ్య అధ్యక్షత వహించి నడిపించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నగర ఉపాధ్యక్షులు ఎం రాజశేఖర్ సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ సివిల్ సప్లై రాష్ట్ర హమాలీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కృష్ణ మాట్లాడుతూ ఎక్స్పెక్ట్ ఏజెన్సీ పండగ కూడా జీతాలు ఇవ్వకుండా సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్స్ కుటుంబాలను ఇబ్బందులు పడేటట్లు చేస్తుంది జీతాలు ఇవ్వకపోవడంతోఅప్పులు చేసి పండగ చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది అప్పులు చేసి తమ కుటుంబాలని పోషించుకోవాల్సిన పరిస్థితి ఎక్స్పర్ట్ ఏజెన్సీకి మాత్రం కార్మికుల పైన ఎలాంటి ప్రేమ లేకుండా కసాయిగా వే వరిస్తుంది హాస్పటల్ సూపరిండెంట్ గారు కూడా హాస్పిటల్లో ఏం జరుగుతుందో కార్మికులకు జీతాలు అందుతున్నాయో లేదో కూడా పర్యవేక్షణ చేయడం లేదు ఏజెన్సీలు ఏమి చెప్తే అదే సరే అన్నట్లుగా సూపరిండెంట్ గారు ఏజెన్సీలకు అనుకూలంగా ఉన్నారు వీ డి ఏ కూడా పెంచకుండగా ఎక్స్పర్ట్ ఏజెన్సీ కాలయాపన చేస్తుంది ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కరెక్ట్ గా సెక్యూరిటీ గార్డ్స్ కు కల్పించడం లేదు ఎక్స్పర్ట్ ఏజెన్సీ వారు తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలను ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు లేనిపక్షంలో సూపర్డెంట్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ కార్మికులు మధు కే రానా ప్రతాప్ మోహన్ రావు అయ్యన్న నర్సప్ప మురళి మారెన్న జాతన్న వెంకన్న కిరణ్ సిఐటియు నగర నాయకులు కే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.