PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురండి

1 min read

– హోంగార్డ్స్ ” డీ మొబలైజేషన్ ” కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపిఎస్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ జిల్లా పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు ఐ పి ఎస్ గారు పిలుపునిచ్చారు. జిల్లా హోంగార్డ్స్ కు రెండు వారాల పాటు నిర్వహించిన ” మొబలైజేషన్ ” కార్యక్రమం బుధవారం తో ముగిసింది. స్థానిక పోలీసు పరేడ్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా హోంగార్డ్స్ కి ప్రతీ ఏటా మొబలైజేషన్ కార్యక్రమం నిర్వహించి విధుల్లో నైపుణ్యం, ఫిజికల్ ఫిట్ నెస్ ను మెరుగుపరచడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉద్యోగంలో చేరే ముందు శిక్షణలో నేర్చుకున్న తర్ఫీదు అంశాలను మరోసారి గుర్తు చేసుకుంటూ మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుకునేందుకు దోహదం చేస్తాయన్నారు. హోంగార్డ్స ల దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యాంగా ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు. అందులో భాగంగానే యోగా, ధ్యానం గురించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. వృతత్తిగత నైపుణ్యాల పెంపునకు, ఆర్ధిక క్రమశిక్షణ పై నిపుణులచే మొబిలైజేషన్ లో భాగంగా ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. విధుల్లో నైపుణ్యాన్ని బాగా మెరుగుపరుచుకోవాలని పలు మెళకువలు సూచించారు. డ్రిల్ , కవాతు, మాబ్ కంట్రోల్ , ప్రముఖుల బందోబస్తు, తదితర విధులు మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో దిశానిర్ధేశం చేశారు.సిబ్బంది సంక్షేమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నా.

About Author