ఉద్యోగులకు అభినందన: రజినికాంత్ రెడ్డి
1 min readపల్లెవెలుగు వెబ్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటీ, జిల్లా చైర్మన్ గిరికుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు జిల్లాలో ‘ వర్క్ టు రూల్’ విజయవంతంగా కొనసాగుతుండటం ప్రశంసనీయమన్నారు ఏపీ ఆర్ఎస్ఏ ఆదోని డివిజన్ అధ్యక్షుడు రజినికాంత్ రెడ్డి. శనివారం సాయంత్రం 5 గంటల తరువాత తహసీల్దార్, ఆర్డీఓ, ఎంపీడీఓ తదితర కార్యాలయాల్లోని ఉద్యోగులను బయటకు పంపి… వర్క్ టు రూల్‌కు సహకరించాలని కోరారు. అంతకు ముందు ఆదోని డిప్యూటీ తహసీల్దార్, ఏపీ ఆర్ఎస్ఏ ఆదోని డివిజన్ అధ్యక్షుడు రజినికాంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగ, కార్మికుల, కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేంత వరకు ఉద్యమం ఆగదన్నారు. ఉద్యమంలో భాగంగా మార్చి 27 న “కారుణ్య నియామాకాల కుటుంబాలు పరామర్శలు యాత్రలు” కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలోను విజయవంతంగా నిర్వహించడమే కాకుండా అందులో ఎక్కువ బాగం ఆర్టీసి మరియు టీచర్ల కుటుంబాలను పరామర్శించిన ఫలితంగా ప్రధానంగా ఒక్క ఆర్టీసి డిపార్టు మెంటులోనే వివిధ కేటగిరులలో 1168 మందికి కారుణ్యనియామాకాల కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఆర్టీసి యం.డి మార్చి 31న ఆదేశాలు జారీ చేశారని, ఇది ఉద్యోగులు సాధించిన విజయమేనన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే.. ఏప్రిల్ 5న మళ్లీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించుకుని భవిష్యత్ కార్యక్రమాలు ప్రకటిస్తామని ఏపీఆర్ఎస్ఏ ఆదోని డివిజన్ అధ్యక్షుడు, డిప్యూటీ తహసీల్దార్ రజినికాంత్ రెడ్డి వెల్లడించారు.