ప్రతి ఒక్కరూ జగనన్న గెలుపు కోసం కృషి చేయాలి
1 min read– ప్రతి ఇంటికి వెళ్లి ఆ కుటుంబ సభ్యులతో కనీసం
– 10 నుంచి 15 నిమిషాలు కేటాయించి ఆ కుటుంబ యోగక్షేమాలను తెలుసుకొని
– ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని తెలిపిన బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి .
– ప్రతి ఇంటికి వెళ్లి 8 2 9 6 0 82960 నెంబర్ కు మిస్డ్ కాల్ అందించాలి.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో ఈనెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జి ల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. అందులో భాగంగానే బనగానపల్లె నియోజకవర్గం లో ఏడవ తేదీన జగన్ అన్న భవిష్యత్ కార్యక్రమము తథా ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. గ్రామ సచివాలయ పరిధిలో గల ముగ్గురు కన్వీనర్లు వాలంటరీలో గృహసారథలో అందరూ కలిసి ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆ కుటుంబ సభ్యుల తో 10 15 నిమిషాలు సమయాన్ని కేటాయించి వారికి సవివరంగా తెలియజేయాలని చెప్పారు. అన్ని అర్హతలు ఉండి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికైనా అందని వారు ఉంటే వారిని కూడా ఈ నెల 13వ తేదీన జగనన్నకు చెబుతామనే కార్యక్రమం ద్వారా గ్రీవెన్స్ ద్వారా నేరుగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ఆ కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్ తో 82960 82960 అనే నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని తెలిపారు. 2024 సంవత్సరంలో మళ్లీ మన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలంటే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబ సభ్యులు వారు ఏ ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు వారికి తెలియజేయవలసిన అవసరం వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద గృహసారధుల మీద ఉందని చెప్పారు. వారికి లబ్ధి పొందిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలియజేసినప్పుడే వారు మళ్ళీ మన వైయస్సార్ పార్టీకి ఓటు వేయడం జరుగుతుందని కాబట్టి ఈ కార్యక్రమాన్ని గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిగా మన జగనన్న అధికారం చేపట్టేంతవరకు కూడా మనం ఒక యుద్ధంలో సైనికుల వలే పోరాటం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని కాబట్టి కృషిచేయాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ జగనన్న గెలుపు కోసం అహర్నిశలు వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషిరెడ్డి, వైయస్సార్ పార్టీ నాయకులు డాక్టర్ మహమ్మద్ హుస్సేన్, సైకిల్ షాప్ మహబూబ్ వలి, రామవరం గ్రామ సర్పంచ్ మనోహర్ యాదవ్, జోలదొరాశి శంకర్ రెడ్డి, గులాంనబీ పేట రాఘవరెడ్డి వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.