PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం

1 min read

– రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
– ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు.గురువారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం నుంచి ప్రారంభించిన సందర్భంగా కర్నూలు జిల్లాలో పత్తికొండ డివిజన్, దేవనకొండ మండలం, పి. కోటకొండ గ్రామం నుండి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గారు,జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం ద్వారా వైద్య సేవలను అందించడం జరుగుతోందన్నారు. మంచానికే పరిమితమైన రోగులకు సైతం గడప వద్దకే వెళ్ళి వైద్యం అందించడం జరుగుతుందన్నారు.. జిల్లాలోని ప్రతి మండలానికి కనీసం రెండు పీహెచ్సీలు, ప్రతి పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉంటారని, ఒక డాక్టర్ పీహెచ్సీ లో ఉంటే మరొక 104 వాహనానికి అనుసంధానముగా వారికి కేటాయించిన గ్రామాలను సందర్శించి వైద్యం అందిస్తారని తెలిపారు..ఆరోగ్య శ్రీ, ఆస్పత్రుల అభివృద్ధి, ఫ్యామిలీ డాక్టర్ తదితర కార్యక్రమాల ద్వారా ముఖ్యమంత్రి వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు.నాలుగేళ్లలో వైద్య, ఆరోగ్య రంగంలో అనేక సంస్క రణలు తీసుకొచ్చి, పేదవారి ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ స్థాపించి, ఆయా సచివాలయాలకు అనుసంధానించడం ద్వారా పనిచే సేలా చర్యలు తీసుకున్నారని వివరించారు.జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మెరుగైన వైద్యం కొరకు వారి ఇంటి ముంగిట అమలు అవుతున్న ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, బిపి, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు చికిత్స రెగ్యులర్ గా ఫాలోఅప్ మరియు నివారణ ఆరోగ్య సేవలును అందజేయడం ద్వారా వ్యాధి తీవ్రత దాల్చకుండా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. జిల్లాలో 25 మండలాలకు నలభై ఒక్క 104 వాహనాల ద్వారా 15 రోజులకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ గ్రామాలకు వెళ్ళి ఆరోగ్య సంబంధిత పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన మందులు కూడా అందిస్తారన్నారు.. గ్రామాల్లో అనారోగ్యంతో ఉన్నవారిని, గర్భవతులను, పాఠశాలల పిల్లలను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లను కోరారు. కాన్పుసమయంలో తల్లులను కాపాడే విధంగా వైద్య పరమైన పరీక్షలు నిర్వహించాలని డాక్టర్లకు సూచించారు.ఫ్యామిలీ ఫిజీషియన్ విధానంలో వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన 104 నూతన వాహనాన్ని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి,కలెక్టర్ ప్రారంభించి అంబులెన్స్ వాహనంలోని వసతులను పరిశీలించారు.అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీల స్త్రీలకు సీమంతము కార్యక్రమాలు నిర్వహించారు.మంత్రి, కలెక్టర్ వారిని ఆశీర్వదించారు. కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు, డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author