బాధిత ఉద్యోగుల కుటుంబాలను.. ప్రభుత్వం ఆదుకోవాలి
1 min readకారుణ్య నియామకం కింద… బాధితులకు ఉద్యోగం ఇవ్వాలి
ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్:నంద్యాల జిల్లా డోన్ మండలం దేవరబండ గ్రామంలో నివాసం ఉంటున్న సీపీఎస్ ఉద్యోగి దస్తగిరి కుటుంబాన్ని ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా చైర్మన్ గిరికుమార్ రెడ్డి, కమిటీ సభ్యులు పరామర్శించారు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన మలిదశ ఉద్యమంలో భాగంగా శనివారం ఎస్జి టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ… మరణించిన దస్తగిరి కుటుంబాన్ని పలకరించగా… బాధిత మహిళ విలపిస్తూ బాధను వెల్లడించింది. తన భర్త దస్తగిరి మరణించి మూడు నెలలైనా ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయలేదని, తాళిబొట్టు అమ్మి పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించామని బాధిత మహిళ చెప్పడం బాధాకరమన్నారు. అదేవిధంగా మున్సిపల్ హై స్కూల్ కర్నూలు నందు ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన శ్రీమతి కే.కాంతమ్మ కుటుంబ సభ్యులను, పదవీ విరమణ పొందిన సీపీఎస్ ఉద్యోగి ఇమ్మానుయేల్ రిటైర్డు ఒకేషనల్ ఇన్స్పెక్టర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీ జేసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కారుణ్య నియామకాల కింద బాధిత కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చెయ్యనందున ఎన్నో కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయని వెల్లడించిన గిరికుమార్ రెడ్డి… ముఖ్యమంత్రి స్పందించి ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో కే.వై. కృష్ణ, నాగరమణయ్య, గిడ్డయ్య, నాగరాజు,లోకేశ్వరి, సూరి బాబు, ప్రతాప్, ప్రశాంత్, ఈశ్వర్, CPS జిల్లా అధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి తదితరులు వున్నారు బైట్. గిరికుమార్ రెడ్డి. ఎపీజేఎసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు తదితరులు ఉన్నారు.