సిద్దార్థ రెడ్డి .. ఓ పిల్ల కాకి..!
1 min read– రాజకీయ పరిజ్ఞానం లేదు..చంద్రబాబు , లోకేష్ లను విమర్శించే స్థాయికాదు..
– యువతకు ఎలాంటి సందేశాలను ఇవ్వాలనుకుంటున్నావు..
– శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి పై …
– టీడీపీ నాయకులు దేవళ్ల మురళీ..ముస్తఫా
– ఘాటు విమర్శలు..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఒక పిల్ల కాకి..రాజకీయ పరిజ్ఞానం లేని అజ్ఞాని అంటూ తెలుగుదేశం పార్టీ కి చెందిన ఆర్టీఎస్ జిల్లా కన్వీనర్ ముస్తఫా ,నందికొట్కూరు శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ పార్టీ పరిశీలకులు దేవళ్ల మురళీ లు సిద్దార్థ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి నివాసంలో నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సిద్దార్థ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ను విమర్శించే స్థాయి కాదన్నారు.వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడుగా ఉన్న మీరు ఈ రాష్ట్రంలోని యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు. నందికొట్కూరు అభివృద్ధిని అడ్డుకుంటున్న మీరు నందికొట్కూరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదని స్పష్టం చేశారు. సిద్దార్థ రెడ్డి ఒకే ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వగలవా ..ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఎందుకు అయ్యారు..జైల్లో ఎందుకు పెట్టారు.. త్వరలో అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవుతున్నారో చెప్పగలవా అంటూ ప్రశ్నించారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికి హత్య చేసి మా నాయకుడు చంద్రబాబు పైన నిందలు వేసి ఆ సానుభూతితో 2019లో మీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరి తెలుసన్నారు.ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం పరిపాలన సాగడం లేదని రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయ్యారు.వచ్చే ఎన్నికల్లో నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గంలో టీడీపీ విజయడంకా మోగిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మంత్రి హోదాలో బట్టలు విప్పి సవాల్ విసరడం సిగ్గు చేటన్నారు. ‘‘మీరు బట్టలు విప్పడం కాదు.. 2024లో ప్రజలే మీ బట్టలు విప్పే పరిస్థితి వస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 2024లో నూటికి నూరు శాతం వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. సీఎం మెప్పు పొందడానికే మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ‘‘ఈరోజు మంత్రి షర్ట్ విప్పితే, రేపు ఇంకో మంత్రి ప్యాంటు విప్పుతాడు, మరోసారి ఇంకో మంత్రి బట్టలన్నీ విప్పుతాడు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటాది. యువగళం కు వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులకు వణుకుపుడుతుందన్నారు.పాదయాత్రకు అడుగడుగునా అవరోధాలు సృష్టించడానికి వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు గుండం రమణా రెడ్డి, నందికొట్కూరు టీడీపీ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకటస్వామి, టీడీపీ నాయకులు పల్లె రఘు రామిరెడ్డి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.