దేశభక్తిపై…బాలబాలికల వేసవి శిక్షణా శిబిరం
1 min read– విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆదివారం ఉ. 9:00 గం.లకు ఠాగూర్ విద్యానికేతన్,కస్తూరి నగర్,శరీన్ నగర్ లో ఈ రోజు ప్రారంభించబడిన ” బాలబాలికల వేసవి శిక్షణా శిబిరము” కార్యక్రమంలో ముఖ్య వక్తగా విచ్చేసిన విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ మాట్లాడుతూ..సనాతన హైందవ సంస్కృతి,సంప్రదాయాలు,ఆదర్శ హిందూ కుటుంబ విలువలు, వంటివి నేర్పించడం కోసం ప్రతిసంవత్సరం వేసవి సెలవులు ప్రారంభంలో విశ్వ హిందూ పరిషత్ , మాతృశక్తి విభాగం ఆధ్వర్యంలో 7 రోజుల ” బాలబాలికల వేసవి శిక్షణా శిబిరము ” ఈ రోజున ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తూ బాలబాలికలందరూ ఎంతో శ్రద్ధతో,స్వేచ్ఛగా ఇక్కడ నేర్పే మన పురాణాల చిన్న చిన్న ఘట్టాలను,వివిధ రకాలైన ఆటలను,మహాపురుషులు జీవితచరిత్రలను చక్కగా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు నిర్వహించిన జ్యోతిప్రజ్వలన అనంతరం కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…..గత కొన్ని సం.లుగా మా పాఠశాల ఠాగూర్ విద్యానికేతన్ లో విశ్వ హిందూ పరిషత్ ,మాతృశక్తి విభాగం వారి ద్వారా పిల్లో దైవభక్తి,దేశభక్తి,కొత్త కొత్త ఆటలు నేర్పిస్తున్నారనీ,మామూలు గా కొన్ని ప్రయివేటు సంస్థలు రుసుము తీసుకుని ఇటువంటివి నేర్పిస్తుంటారనీ,కానీ మాతృశక్తి వారు ఉచితంగా మా పిల్లలకు ఈ ధార్మిక శిక్షణను ఇవ్వటం ఆనందదాయకమని అన్నారు,ఈ సం. జరిగిన భగవద్గీత కంఠస్థం పోటీల్లో కూడా మా పిల్లలు అధ్భుతమైన ప్రతిభ కనపరచారనీ ,పోటీల్లో ను,వేసవి శిక్షణా శిబిరం నిర్వహణలోనూ శ్రీమతి భార్గవి మా కెంతో సహకారం అందించారని తెలిపారు,నిర్వాహకురాలైన విశ్వ హిందూ పరిషత్, మాతృశక్తి కర్నూలు నగర కన్వీనర్ శ్రీమతి భార్గవి మాట్లాడుతూ ఈ ఏడు రోజులు రెండు చోట్ల ఈ వేసవి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నామని,ఒకటి ఠాగూర్ విద్యానికేతన్ కస్తూరి నగర్,లో మరొకటి శ్రీ సద్గురు త్యాగరాజ సీతారామాలయం, శరీన్ నగర్లో జరుగుతాయన్నారు. ఈ శిబిరం 30/4/23 ఆదివారం నుండి 7/5/23 ఆదివారం వరకు ఉ. 9:00 గం.ల నుండి 11:00 గం. వరకు శిక్షణ ఉంటుందని 8/5/23 తేదీన సోమవారం ముగింపు కార్యక్రమం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సహ శిక్షకులు హేమ,బిందు,అశ్విని,ప్రవీణ్ బాలబాలికలు పాల్గొన్నారు.