జలదీక్ష కు కదిలిన అధికార యంత్రాంగం
1 min read– మండ్లెం మెట్ట పొలాలను పరిశీలించిన నీటిపారుదల శాఖ అధికారులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: మండ్లెం గ్రామ రైతుల జలదీక్షకు ఎట్టకేలకు నీటిపారుదల శాఖ అధికారులు స్పందించారు. మండ్లెం,తంగడంచ భాస్కరపురం గ్రామాల మధ్యలో ఉన్న మెట్ట పొలాలను రైతులతో కలిసి ఇరిగేషన్ శాఖ ఈఈ మహబూబ్ ,డీఈ కేశవరెడ్డి, ఏఈ షబ్బీర్, టీఏ సాంబ శివుడు లు పరిశీలించారు. రైతుల వివరాలు ఆయకట్టు వివరాలు త్వరగా అందిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి శ్రీశైలం నీటి మునక గ్రామాలకు కృష్ణ జలాల ద్వారా ప్రత్యేక లిఫ్టు ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని త్వరగా గ్రామ రైతాంగానికి సాగునిరు అందించాలని , త్వరలో చీఫ్ ఇంజనీర్ ను కలుస్తామని సిపిఐ జిల్లా నాయకులు రమేష్ బాబు అన్నారు.న్యాయం జరిగేంత వరకు జలదిక్ష కొనసాగుతుందని రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో ప్రసాద్, అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్న జూపాడు బంగ్లా మండల వైస్ ఎంపీపీ కృష్ణా రెడ్డి గ్రామ రైతులు తదితరులు ఉన్నారు.