నాగలాపురం గ్రామ సచివాలయం.. జిల్లా కలెక్టర్ తనిఖీ
1 min read– స్పందనలో వచ్చిన గ్రీవెన్స్లకు నాణ్యతతో కూడిన ఎండార్స్మెంట్లు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్పందనలో వచ్చిన గ్రీవెన్స్ లకు నాణ్యతతో కూడిన ఎండార్స్మెంట్లు ఇవ్వాలని సచివాలయ సిబ్బందికి జిల్లా కలెక్టర్ డా.జి.సృజన ఆదేశించారు. శనివారం గూడూరు మండలం నాగలాపురం గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ నాగలపురం గ్రామంలో ఎంత మందికి పెన్షన్ వస్తుందని సచివాలయ సిబ్బందిని ఆరా తీయగా 360 మందికి పెన్షన్ వస్తుందని జిల్లా కలెక్టర్ గారికి వివరించారు. సచివాలయ పరిధిలో 5 నుండి 15 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఎంతమంది ఉన్నారని వారిలో ఎంతమంది బడి బయట పిల్లలు ఉన్నారని వాటి వివరాల గురించి ఆరా తీయగా 381 మంది 5 నుండి 15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఉన్నారని ఏ ఒక్క పిల్లవాడు కూడా బడి బయట పిల్లవాడు లేడని జిల్లా కలెక్టర్ గారికి వివరించారు. గర్భిణీ స్త్రీలు ఎంతమంది ఉన్నారని అదే విధంగా అడల్సెంట్ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారని ఏఎన్ఎమ్ ని ఆరా తీయగా 25 మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారని అందులో 9 మంది రక్తహీనతతో ఉన్నారని అదేవిధంగా 263 మంది అడల్సేంట్ అమ్మాయిలు ఉన్నారని వారిలో ఆరు మంది రక్తహీనతతో ఉన్నారని జిల్లా కలెక్టర్ గారికి వివరించారు. రక్తహీనత ఉన్నవారికి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తున్నారా ఒకవేళ ఇస్తుంటే వారు వేసుకుంటున్నారా లేదా పర్యవేక్షణ చేస్తున్నారా లేదా అని ఏఎన్ఏం ని ఆరా తీయగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తున్నామని ఇంటికి వెళ్లి పర్యవేక్షణ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ గారికి వివరించారు.అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయని అందులో 0-5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారని అడగగా 68 మంది ఉన్నారని జిల్లా కలెక్టర్ గారికి తెలిపారు. స్పందనకి సంబంధించి ఎన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఎన్ని కేసులు బియాండ్ ఎస్ఎల్ఏ మరియు రీఓపెన్ అయ్యాయని సంబంధిత వారిని అడగగా ఏ ఒక్క కేసు కూడా బియాండ్ ఎస్ఎల్ఎ మరియు రీ ఓపెన్ లో లేవని కేవలం ఒక కేసు మాత్రమే పెండింగ్లో ఉందని జిల్లా కలెక్టర్ గారికి వివరించారు. పెండింగ్లో ఉన్న కేసును త్వరితగతిన పరిష్కరించాలని ఏ ఒక్క కేసు కూడా రీ ఓపెన్ అవ్వకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సబహా పర్వీన్,గూడూరు తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో మాధవి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.