అహోబిల నరసింహా… పాహిమాం పాహిమాం..
1 min readపల్లెవెలుగు వెబ్ ఆళ్లగడ్డ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ నరసింహ స్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లను, ఉత్సవ మూర్తులైన శ్రీ జ్వాలా నరసింహస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు, దిగువ అహోబిలం లో వెలసిన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్లతో పాటు ఉత్సవ మూర్తులైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించారు. శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. స్వామి దర్శనం కోసం ఎగువ అహోబిలం లో క్యూలైన్లలో వేచి ఉండి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం నుండే నల్లమల అరణ్యం లో వెలిసిన నవనారసింహులలో ఒకరైన శ్రీ పాములేటి (పావన)నరసింహ స్వామి ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు బంధుమిత్రులతో తరలి వెళ్లి రాత్రి అక్కడే బస చేసి వేకువజామునే పాములేటి (పావన)నరసింహ స్వామి కి పూజలు నిర్వహించి మొక్కుబడులు తీర్చుకొని ఎగువ అహోబిలానికి కొందరు కాలినడకన మరికొందరు వాహనాలలో తరలివచ్చి స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
భక్తులకు అన్నదానం……అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు దేవస్థానం అన్న సత్రం లో, వాసవి, బ్రాహ్మణ, తొగట అన్న సత్రాల్లో భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అలాగే గే దిగువ అహోబిలం లో దేవస్థానం సత్రం, రెడ్డి సత్రం, యోగానంద నరసింహస్వామి వెలిసిన శ్రీ కాశిరెడ్డి నాయన నిత్యాన్నదాన సత్రం లో వచ్చిన భక్తులకు లేదనకుండా అన్నదాన వితరణ చేశారు.