వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్ట్ ని గెజిటెడ్ హోదా కల్పించాలి
1 min read– ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఎన్జీవో హోమ్ లో ఆంధ్రప్రదేశ్ నాన్- గ్రాడ్యుయేట్ వెటర్నేరియన్స్ ఫెడరేషన్ సమావేశంకు సోమవారం హాజరయి. పశు సంవర్ధక శాఖ లో పనిచేస్తున్న పారా వెటర్నేరియన్స్ సమస్యలు పరిష్కరించాలని. వెటర్నరీ లైవ్ స్టాక్ ఆఫీసర్ పోస్ట్ ని గెజెట్టేడ్ హోదా కల్పించాలని ప్రభుత్వానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా ప్రభుత్వం కాలయాపన చేస్తున్న ఈ సమస్యను తక్షణo పరిష్కరించాలని సంఘం సభ్యులు తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ నాయకులు ఆర్ ఎస్ హరనాధ్. జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు. రాష్ట్ర వెటర్నేరియన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సేవా నాయక్. జిల్లా ఎన్జీవో సంఘ సంయుక్త కార్యదర్శి మెరుగు ఫణి కుమార్. ఎన్జీవో సంఘ తాడేపల్లిగూడెం అసోసియేట్ ప్రెసిడెంట్ పితాని సత్యనారాయణ.తదితరులు పాల్గొన్నారు.