NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరోపకారమే మన వెంట వచ్చేది…

1 min read

​​– డాక్టర్ వి.ఎస్. ఆఖిల్
పల్లెవెలుగు వెబ్​, కడప బ్యూరో: సంపాదించిన దాంట్లో.. కొంతైనా పేదలకు దానధర్మాల ద్వారా అందజేయాలని డాక్టర్​ వీఎస్​ అఖిల్​ అన్నారు. కడప అసెంబ్లీ టీడీపీ ఇంచార్జి వి.ఎస్.అమీర్ బాబు ఆధ్వర్యంలో ఆదివారం కడప శివారులోని రిమ్స్ వద్ద 11వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని డా.వీఎస్​ అఖిల్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. అఖిల్​ మాట్లాడుతూ ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితులలో కోవిడ్ బాధితుల వెంట వచ్చే వారికి అన్నదాన కార్యక్రమం చేయడం మంచి పుణ్య కార్యమన్నారు. కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీని జాప్యం చేయకుండా ప్రభుత్వం వారికి సహకరించి, ప్రజలు కోవిడ్ బారిన పడకుండా కాపాడాలని అన్నారు. ప్రజలందరూ సామాజిక బాధ్యతతో మెలిగి కరోనా మహమ్మరిని దేశం నుండి తరిమి వేయాలని పిలుపునిచ్చారు. ఈ అన్నదాన కార్యక్రమంలో జలతోటి జయకుమార్, ఆమూరి బాలదాసు, నాసిర్ అలీ, ఛాన్ బాష, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author