PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హోటల్స్.. ట్రేడ్​ రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి

1 min read

కర్నూలు జిల్లా పర్యాటక శాఖ ఉన్నతాధికారి పి.విజయ

పల్లెవెలుగు: కర్నూలు జిల్లాలోని హోటల్స్​ ట్రేడ్స్​ రిజిస్ర్టేషన్​ చేసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ ఉన్నతాధికారి పి. విజయ తెలిపారు.   ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె తెలిపారు. హోటల్స్​, లాడ్జిలు, రెస్టారెంట్లు, వెల్నెస్​ సెంటర్లు, ట్రావెల్​ ఆపరేటర్స్​  అందరూ ట్రేడ్​ రిజిస్ర్టేషన్​  చేసుకోవాలని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ట్రేడ్​ రిజిస్ర్టేషన్​ చేయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వ సర్టిఫికెట్​తోపాటు కేంద్ర ప్రభుత్వ సాతి–నిధిఇవ్వడం  జరుగుతుందని, ఈ సర్టిఫికెట్​ పొందిన వారికి పర్యాటక ప్రయోజనాలు  చేకూరుతాయని  తెలిపారు. హోటల్స్​, రెస్టారెంట్స్​, లాడ్జిలు, గెస్ట్​హౌస్​ లకు మూడు వందల రూపాయలు, హోం  స్టేలు,, ఫాం స్టేలకు రూ.200, టూర్​ బోటు ఆపరేటర్స్​  ఎడ్వంచర్​ స్పోర్ట్స్​వాటర్ స్పోర్ట్స్ ఆపరేటర్స్​కు రూ.500లు, వెల్నెస్​  సెంటర్లు, కన్వెన్షన్​ హాలు,  సర్వీసు అపార్టుమెంట్స్​ రూ.500 ప్రకారం  వెబ్​  సైటు ద్వారా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని, పూర్తి వివరాలకు తమను ( సెల్​.నం.6309942034) సంప్రదించాలని   ఈ సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఉన్నతాధికారి పి. విజయ వెల్లడించారు.

About Author