కర్ణాటక మధ్యాన్ని పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు : ఎస్ఐ
1 min readఅక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : నిన్నటి దినమున 19.05.2023 వ తేదీన ఉదయం సుమారు 05.00 గంటలకు రాబడిన సమాచారం మేరకు రాజ శ్రీ కోసిగి CI ఏరిసా వలీ ఉత్తర్వుల మేరకు, కౌతాలం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి, తన సిబ్బంది వీరేష్, నరేంద్ర, హుస్సేన్ బాష, రామ చంద్ర మరియు రంగన్న ల సహాయంతో ఉదయం సుమారు 6.30 గంటలకు వల్లూర్ గ్రామము శివారున గల తుంగభద్ర నది ఒడ్డున కోసిగి గ్రామానికి చెందిన (1) తోవి వినోద్ కుమార్ , వయసు 25 సం.లు తండ్రి తిరుమల , కడదొడ్డి గ్రామము,కోసిగి మండలము 2) కుప్పగల్ శీను , వయసు 20 సం.లు తండ్రి గోవిందు , కోసిగి టౌన్ 3) నడిగేరి ఊరుకుంద @ రాజు, వయసు 21 సం.లు తండ్రి ఈరన్న , కోసిగి టౌన్ ముగ్గురు కర్ణాటక రాష్ట్రంలోని మాన్విలోని వైన్ షాప్ ల నుండి కర్ణాటక మద్యాన్ని తక్కువ రేటుకు కొనుక్కోని నది ఆవలి వైపు నుండి ఒక తెప్ప సహాయంతో నది ఈ వైపునకు తెచ్చుకొని రెండు మోటార్ సైకళ్ళ పై వేసుకొని చుట్టుపక్కల గ్రామాల వారికి హోల్ షేల్ గా అమ్ముకుందామని పోతుండగా పై ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసి, వారి వద్ద ఉన్న 64 బాక్స్ లు ఒరిజినల్ చాయిస్ మరియు డీలక్స్, విస్కీ కర్ణాటక టెట్రా పాకెట్లు , 90 ఎంఎల్ ( మొత్తం 6,144 ప్యాకెట్స్ ) లను, రెండు మోటార్ సైకళ్ళను మరియు ఒక తెప్పను కేసు తదుపరి చర్య నిమిత్తం స్వాదీన పరుచుకోవడమైనది. కావున ఎవరైనా కర్ణాటక మధ్యం అమ్మినా, తరలించినా, కల్గి ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. మొత్తం64 బాక్స్ ( మొత్తం 6,144 packets) మరియు ఒరిజినల్ ఛాయిస్ డీలక్స్ విస్కీ కర్ణాటక టెట్రా పాకెట్స్ 90 ML దీని మార్కెట్ విలువ రూ 6,00,000/-(ఆరు లక్షల రూపాయలు) విలువ గల పెద్ద మొత్తములో అక్రమ మధ్యన్ని పట్టుకునందుకు గాను ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి, మరియు అతని సిబ్బంది ని రాజ శ్రీ కుర్నూల్ ఎస్పి శ్రీ. కృష్ణ కాంత్ గారు అభినందించారు.. కర్ణాటక వైపు మద్యం మద్యం సరఫరా వంటి వస్తువులు తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును.