జగనన్న విద్యా దీవెన… తల్లుల ఖాతాల్లో జమ
1 min read– రూ. 24.78 కోట్లు జమ.. 26,024 మంది విద్యార్ధులకు లబ్ది..
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 26,024 మంది అర్హులైన విద్యార్థులకు సంబంధించి 23,455 మంది తల్లుల ఖాతాలకు రూ. 24.78 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బుధవారం జగనన్న విద్యా దీవెన కింద జనవరి, మార్చి-2023 త్రైమాసికానికి సంబంధించి ఫీజు రియింబర్స్ మెంట్ ను అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏలురు కలెక్టరేట్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా బిసి సంక్షేమ శాకాధికారి ఆర్ వి. నాగరాణి, విద్యార్థినీలు, వారి తల్లులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులకు రూ. 24.78 కోట్ల మెగా చెక్ ను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐఐటి, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇచ్చేలా వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతోందన్నారు. జిల్లాలో జగనన్న విద్యాదీవెన కింద 26,024 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరిందన్నారు. అందులో ఎస్సీ సంక్షేమం కింద 335 మంది విద్యార్థులకు చెందిన 334 మంది తల్లుల ఖాతాలల్లో రూ.43 లక్షలను జమ చేయడం జరిగిందన్నారు. ఎస్టీ సంక్షేమం కింద 1483 మంది విద్యార్థులకు చెందిన 1371 మంది తల్లుల ఖాతాలల్లో రూ.86 లక్షలు, బిసి సంక్షేమం కింద 15361 మంది విద్యార్థులకు చెందిన 13779 మంది తల్లుల ఖాతాలల్లో రూ.14.02 కోట్లను జమ చేయడం జరిగిందన్నారు. ఈబిసి కింద 3041 మంది విద్యార్థులకు చెందిన 2777 మంది తల్లి ఖాతాలల్లో రూ. 3.90 కోట్లు, ముస్లిం మైనారిటీ కింద 905 మంది విద్యార్థులకు చెందిన 791 మంది తల్లి ఖాతాలల్లో రూ. 84 లక్షలను జమ చేయడం జరిగిందన్నారు. కాపు సంక్షేమం కింద 4486 మంది విద్యార్థులకు చెందిన 4038 మంది తల్లి ఖాతాలల్లో రూ. 4.36 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ కింద 413 మంది విద్యార్థులకు చెందిన 365 మంది తల్లి ఖాతాలల్లో రూ. 38 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గాల వారీగా వివరాలు చింతలపూడి నియోజకవర్గంలో 3 వేల 818 మంది విద్యార్ధులకు రూ. 3.71 కోట్లు, దెందులూరు నియోజకవర్గంలో 4 వేల 329 మంది విద్యార్ధులకు రూ. 4.41 కోట్లు, ఏలూరు నియోజకవర్గంలో 2 వేల 592 మంది విద్యార్ధులకు రూ. 2.81 కోట్లు, గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకాతిరుమల మండలంలో 731 మంది విద్యార్ధులకు రూ. 68 లక్షలు, కైకలూరు నియోజకవర్గంలో 3 వేల 497 మంది విద్యార్ధులకు రూ. 3.20 కోట్లు, నూజివీడు నియోజకవర్గంలో 4 వేల 050 మంది విద్యార్ధులకు రూ. 3.98 కోట్లు, పోలవరం నియోజకవర్గంలో 3 వేల 628 మంది విద్యార్ధులకు రూ. 2.86 కోట్లు, ఉంగుటూరు నియోజకవర్గంలో 3 వేల 379 మంది విద్యార్ధులకు రూ. 3.12 కోట్లు లబ్ది చేకూరింది.