వృద్ధులు జీవితం మార్గ నిర్దేశకులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నేటి యువతరం జీవిత అనుభవం తెలుసుకోవాలంటే వృద్ధులతో గడపాలని. వృద్ధాప్యం మరో పసితనం లాంటిదని, వృద్ధులే జీవిత మార్గదర్శకులు అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి వృద్ధుల పట్ల ప్రేమ ఆప్యాయతలు చూపాలని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ కోరారు. ఈరోజు కర్నూల్ మండలం దీన్నే దేవరపాడు గ్రామ పరిధిలోని కృప వృద్ధాశ్రమం లో వృద్ధులకు నిత్యవసర సరుకులను అందజేశారు. సీనియర్ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ వృద్ధులు ఆత్మీయుల కొరకు ఎంతగానో ఎదురు చూపులు చూసే మనసు ఉంటుందని, ప్రేమ ఆప్యాయతలు లేని సంసారాల వల్ల ఉద్యోగాల పేరిట దూరం అవుతున్న కొడుకు కోడలు వల్ల గృహ సంబంధమైన వివాదాల వల్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండేందుకు వృద్ధాశ్రమాల్లో చేరి ఏకాకుల ఉంటున్నారని, కారణం ఏదైనా ఫలితం మాత్రం తల్లిదండ్రుల మీదే పడుతుందన్నారు. జీవిత అనుభవం తెలుసుకోవాలంటే నేటి యువతరం వృద్ధులతో గడపాలని అప్పుడే యువతరంలో ఉన్న అందరికీ మార్గ నిర్దేశకులన్నీ తెలుస్తుందన్నారు.