PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో… సచివాలయాల్లో రిజిస్ట్రేషన్

1 min read

జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య

పల్లెవెలుగు: కర్నూలు జిల్లాలో రీ సర్వే పూర్తయిన 67 గ్రామాల్లోని 59 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించడం జరిగిందని, ప్రజలు ఆ సచివాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య విజ్ఞప్తి చేశారు. బుధవారం జాయింట్ కలెక్టర్ ఈ అంశంపై మాట్లాడుతూ  అమ్మకాలు, గిఫ్ట్ డీడ్, వీలునామా,మార్ట్ గేజ్ అంశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సేవలను  ఈ సచివాలయాల నుంచే చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ తెలిపారు.. వీటితోపాటు మ్యుటేషన్స్, సబ్ డివిజన్స్, ల్యాండ్ కన్వర్షన్ సేవలు కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయని  జెసి తెలిపారు. సచివాలయాలకు సంబంధించిన పంచాయతీ సెక్రెటరీ జాయింట్  సబ్ రిజిష్ట్రార్ గా వ్యవహరిస్తారని జెసి తెలిపారు. రిజిస్ట్రేషన్ అంశాలలో రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పంచాయతీ సెక్రెటరీ లను గైడ్ చేస్తారన్నారు. సచివాలయాల్లో రిజిస్టర్ అయిన  అన్ని వివరాలు సబ్ రిజిస్టార్ కు  వెళ్తాయని, వాటిని పరిశీలించి  రిజిస్ట్రేషన్ అధికారులు ఆమోదం తెలుపుతారని జేసీ తెలిపారు. ఇప్పటివరకు 67 గ్రామాల్లోని 59 సచివాలయాల్లో 124 రిజిస్ట్రేషన్లు చేయడం జరిగిందని జెసి వివరించారు.

67 గ్రామాలు…59 సచివాలయాల్లో రిజిస్ర్టేషన్​

రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన సచివాలయాలు కల్లూరు మండలంలో ఒకటి, కోడుమూరు మండలంలో ఒకటి,కౌతాళం మండలంలో ఐదు, కోసిగి మండలంలో 6,మంత్రాలయం మండలంలో మూడు, నందవరం మండలంలో నాలుగు, గోనెగండ్ల మండలంలో ఏడు, ఎమ్మిగనూరు మండలంలో 12, పెద్దకడబూరు మండలంలో 11,ఆదోని మండలంలో ఒకటి, ఆలూరు మండలంలో రెండు, ఆస్పరి మండలంలో రెండు, దేవనకొండ మండలంలో రెండు, తుగ్గలి మండలంలో ఒకటి, పత్తికొండ మండలంలో ఒకటి అని జేసీ తెలిపారు.. ఇందులో కల్లూరు మండలంలోని పందిపాడు సచివాలయంలో అత్యధికంగా 64 రిజిస్ట్రేషన్లు చేసినట్లు జెసి వివరించారు.. జిల్లాలోని ప్రజలు సచివాలయాల్లో కల్పించిన రిజిస్ట్రేషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

About Author