PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సెప్టెంబర్ 15 నాటికి… నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టండి

1 min read

జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  సెప్టెంబర్ నెల 15 నాటికి ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉపాధి హామీ పనులు, ప్రయారిటీ భవనల నిర్మాణాల అంశాల మీద మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  జిల్లా కలెక్టర్ డా.జి.సృజన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత భవనాలకు సంబంధించిన నిర్మాణాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించారని కలెక్టర్ పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 నాటికి పెండింగ్ లో ఉన్న ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మండల స్థాయి అధికారులు ఈ అంశం మీద ఈరోజు సమీక్ష నిర్వహించుకొని, యాక్షన్ ప్లాన్ రూపొందించుకొని పంచాయతీరాజ్ ఎస్ఈ కి పంపించాలన్నారు.ఉపాధి హామీ పనులకు సంబంధించి  దేవనకొండ, కల్లూరు, కృష్ణగిరి, ఆస్పరి మండలాలలో ఉపాధి హామీ పని దినాల శాతాన్ని తక్కువ నమోదు చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధి హామీ పని దినాల శాతాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఓలు, ఎపిఓ లను కలెక్టర్ అదేశించారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ ప్రజలకు ఉపాధి కల్పించడంలో,  దివ్యాంగులకు ఉపాధి పనులు కల్పించడంలో పురోగతి సాధించాలన్నారు. NMMS(నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టం) యాప్ ద్వారా ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికుల హాజరును తీసుకోవడంలో గూడూరు లాంటి మండలాలు 100 శాతం సాధిస్తుంటే క్రిష్ణగిరి, వెల్దుర్తి, నందవరం, దేవనకొండ మండలాలు 70 శాతం లోపల  పురోగతి సాధించడం ఏంటని కలెక్టర్ ప్రశ్నించారు. మీరు తక్కువ శాతాన్ని నమోదు చేయడం  వల్ల జిల్లా పురోగతిలో వెనుక పడుతుందని అన్నారు, సంబంధిత ఎపిఓ లు కార్మికుల హాజరు శాతంలో పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ అథెంటిఫికేషన్ కి సంబంధించి పెద్దకడబూరు, ఆదోని మండలాలు తక్కువ శాతం పురోగతి సాధించారని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ కి సంబంధించి బ్లూ ఫ్రాగ్ యాప్ నందు పిట్టింగ్ అప్డేషన్ చేయడంలో కల్లూరు మండలం తక్కువ శాతం లో ఉందని పురోగతి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న చెత్త సంపద తయారీ కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్రహ్మణ్యం, జిల్లా పరిషత్ సీఈవో నాసర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author