జగనన్న సురక్ష – పేద ప్రజలందరికీ రక్ష
1 min read– పోచం రెడ్డి నరేన్ రామాంజనేయుల రెడ్డి
పల్లెవెలుగు వెబ్, చెన్నూరు : గ్రామాలలో ఉన్న పేద ప్రజల సమస్యల పరిష్కార వేదికే జగనన్న సురక్ష అని చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులరెడ్డి అన్నారు, బుధవారం సాయంత్రం చెన్నూరు ఒకటవ గ్రామ సచివాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు, ఎన్నో ఏళ్లుగా గ్రామాలలో ఉన్నటువంటి పరిష్కారం కానీ సమస్యలను గ్రామ వాలంటీర్ల ద్వారా తెలుసుకొని వాటిని ఏకకాలంలో పరిష్కరించడమే జగనన్న సురక్ష యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ధ్యేయంగా గ్రామ వాలంటీర్ల, గ్రామ సచివాలయాలు వ్యవస్థను తీసుకురావడం జరిగిందన్నారు, తద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వీటి ద్వారానే సకారం అవుతుందని భావించి, ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించి, దీని ద్వారా పేద ప్రజలకు ఎన్నో సేవలను అందించడం జరుగుతుందన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని నెరవేర్చడమే కాకుండా, చెప్పనివి కూడా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే చెందుతుందన్నారు, నేడు ఆంధ్ర ప్రదేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఏ రాష్ట్రంలో అమలు కాలేదని ఆయన తెలిపారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలను నట్టేట ముంచేశారని ఆయన అన్నారు, బ్యాంకులలో ఉన్నటువంటి బంగారు తీసుకురావడం కానీ, అలాగే అప్పులను కట్టడం దేవుడు ఎరుగు, వారి కి వచ్చిన వడ్డీలను చూసి నివ్వరపోయారని ఆయన తెలిపారు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మహిళల భద్రతకు, భవిష్యత్తుకు భరోసా ఇస్తూ, వారికున్న డ్వాక్రా రుణాలు అన్నిటిని కూడా వడ్డీతో సహా కట్టడం జరిగిందన్నారు, , దూర దృష్టి కలిగిన , ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎంతో కృషి చేస్తున్నారని రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు, అలాగే ఎరువులు అందించడమే కాకుండా వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు, ఒకటవ సచివాలయం పరిధిలో 1452 కుటుంబాలకు 36 కోట్ల రూపాయలు వివిధ పథకాల రూపంలో అందించడం జరిగిందన్నారు, అనంతరం లబ్ధిదారులకు వివిధ 11 రకాల 935 సర్టిఫికెట్లను పంపిణీ చేశారు ,ఈ కార్యక్రమంలో తాసిల్దార్ పఠాన్ అలీ ఖాన్, ఎంపీడీవో గంగనపల్లి సురేష్ బాబు, వైఎస్ఆర్సిపి టౌన్ ఇంచార్జ్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, మండల ఉపాధ్యక్షులు ఆర్ ఎస్ ఆర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ వారిస్, సర్పంచ్ లు సిద్దిగారి వెంకటసుబ్బయ్య, తుంగా చంద్రశేఖర్ యాదవ్, కార్యదర్శి రామ సుబ్బారెడ్డి , ఎంపీటీసీ లు ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, రఘురామిరెడ్డి, సాదిక్ అలీ, చంద్ర, జెసిఎస్ టౌన్ కన్వీనర్ శ్రీనివాస శ్రీనివాస రాజు, ఎర్ర సాని మోహన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్ర ఓబుల రెడ్డి( బాబు) ఉపసర్పంచ్ జుమన్, రబ్, హస్రత్ సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకుల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.