NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒకరోజు మెగా క్యాంపెయిన్ కార్యక్రమం

1 min read

– రైతు ఉత్పత్తి దారుల వవ్యసాయ సహకార సంఘాల బలో పేతానికి కేంద్ర ప్రభుత్వం కృషి.

– కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్ షా కితాబు       

పల్లెవెలుగు వెబ్, పత్తికొండ: కర్నూల్ జిల్లా పత్తికొండ మండలం సేవాలాల్ రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘం,తో పాటు అన్ని రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు విశేషంగా కృషి చేస్తున్నాయని హోం శాఖ మంత్రి అమిత్ షా కితాబిచ్చారు. జూలై, 14 న దేశం లో అన్ని రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘలకు   కేంద్ర హోం మరియు ,సహకార మంత్రి అమిత్ షా చేతులు మీదుగా ఢిల్లీ లో ఒకరోజు మెగా క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  జరిగిన ఈ సమ్మేళనం లో దేశ వ్యాప్తంగా  రాష్ట్రాల నుండి FPO చైర్మన్ లు, CEO లు ,CBBO ప్రతి నిధులు శాస్త్ర సాంకేతిక నిపుణులు (KVK BANAVASI,KURNOOL DISTRICT)వ్యవసాయ ఆధారిత మార్కెటింగ్ మేనేజర్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పెళ్లిమంత  గ్రామంలో ఉన్న సేవాలాల్  రైతు ఉత్పత్తి దారుల సహకార సంఘంలో  750 మంది రైతు సభ్యులు ఉన్నారనీ ఆ సంస్థ సీఈవో చిన్న మునిస్వామి తెలిపారు. NCDC వారి ఆర్థిక సహకారం తో మరియు KVK BANAVASI వారి సాంకేతిక పరిజ్ఞానం తో ఈ సంఘం విజయవంతంగా నడుస్తున్నదని, ఆయన తెలిపారు.  . 14 వ తేదీన ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి NCDC రీజినల్ డైరెక్టర్ దువాసి వంశీ కృష్ణ , FPO చైర్మన్ ఎస్.కృష్ణ నాయక్ ,CEO ముని స్వామి,  అకౌంటెంట్ N.రమణ నాయక్ తదితరులు పాల్గొన్నట్లు చెప్పారు.

About Author