సీజన్ లో వ్యాధుల వలన అప్రమత్తంగా ఉండాలి
1 min read– డాక్టర్ నితీష్ కుమార్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: సీజన్ లో వ్యాధుల వలన అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ నితీష్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఆయన మాట్లాడుతూ సీజన్లలో డెంగు ,టైఫాయిడ్,మలేరియా వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,డెంగు,టైఫాయిడ్ వ్యాధులు దోమల వలన ఈ వ్యాధులు వ్యాపిస్తాయని,అలాగే మలేరియా కలుషిత ఆహారం,కలుషిత నీరు వలన మలేరియా సంభవించే అవకాశం ఉందని ఆయన సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ తో ఇంటింటికి వైద్యం అందిస్తున్నామని ఆయన అన్నారు. ఆరోగ్యం పట్ల ఏమైనా సమస్యలు ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆశ వర్కర్ సంప్రదిస్తే వాటికి మందులు అందిస్తారని,రోగ సమస్య ఎక్కువగా వుంటే ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేస్తారని ఆయన అన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కలుషిత నీరు, కలుషిత ఆహారం పట్ల శ్రద్ధ వహించి నీటిని కాంచి చల్లార్చి వడగట్టి తాగాలని ,అలాగే పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా శుభ్రంగా ఉంచుకుంటే రోగాల బారిన పడకుండా ఉంటామని, ఆరోగ్యమే మహాభాగ్యం కనుక ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.