PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వేలేరు పాడు మండలంలో వరద పునరావాస సహాయం..

1 min read

– 3742 మంది కుటుంబాలకు రూ.68. 93 లక్షలు  ఆర్థిక సహాయం..

– తహసిల్దార్ చల్లన్నదొర

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  వేలేరుపాడు మండలంలో వరద పునరావాస సహాయం కింద 35 గ్రామాల్లో వరద పునరావాస సహాయం కింద 3,742 మంది కుటుంబాలకు 68లక్షల 93వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం  ప్రారంభించినట్లు వేలేరుపాడు తాహసిల్దార్ చల్లన్న దొర తెలిపారు. బుధవారం వేలేరుపాడు మండలంలోని    తోటకూరగొమ్ము పంచాయతీ పరిధిలోని శుద్ధ గుంపు , శ్రీరాంపురం  గ్రామాలలో వరద పునరావాస సహాయం కింద ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమం ప్రారంభించి  ఆర్థిక సహాయం సెక్రటరీ బి బాబురావు సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా తాహాసిల్దార్  మాట్లాడుతూ ఒక్కరు ఉన్న కుటుంబానికి వెయ్యి రూపాయలు, ఇద్దరికి మించి సభ్యులు ఉన్న కుటుంబానికి 2 వేల రూపాయలు చొప్పున అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతీ కుటుంబానికి 25 కేజీల చొప్పున  బియ్యం, కిలో కందిపప్పు, లీటరు వంటనూనె, కూరగాయలు  అందించామన్నారు.ఇప్పటివరకు 1486 కిలోల బియ్యం,6,058 కిలో కందిపప్పు,6058 లీటర్ల వంట నూనె పంపిణీ చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వరద పునరావాస సాయం అందిస్తున్నామన్నారు.  గ్రామాలలో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం పనులు వేగవంతం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కె. లక్ష్మీదేవి, జడ్పిటిసి గుజ్జు రామలక్ష్మి, ఎంపీటీసీ రాంబాబు, ఎంపీడీవో శ్రీహరి, పంచాయతీ సెక్రెటరీ బి. బాబురావు, వీఆర్వో సంగీతరావు, ప్రజా ప్రతినిధి కామినేని వెంకటేశ్వరరావు ,వాలంటరీలు తదితరులు పాల్గొన్నారు.

About Author