PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దాతలకు… అభినందన

1 min read

– మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్​
– రూ. 20వేలు విలువ చేసే బెడ్​షీట్లు, వంట సరుకులు విరాళంగా అందజేసిన దాతలు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కరోన విపత్కర కాలంలో కోవిడ్​ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలు, స్వచ్ఛంద సంస్థలకు అభినందనలు తెలిపారు సీపీఎం మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్​. నగరంలోని కార్మిక, కర్షక భవనంలో సుందరయ్య స్పూర్తి కేంద్రలో కోవిడ్​ బాధితుల కోసం ఐసోలేషన్​ సెంటర్​ కొనసాగిస్తున్నారు. కరోనా బాధితుల అవసరాల కోసం బెడ్ షీట్లు, కందిపప్పు, మంచి నూనె, ఉప్మా రవ్వ, బెల్లం, చక్కెర వంటి నిత్యావసర సరుకులు రూ 20,000/-ల విలువైన వాటిని ఆశ్రయ ట్రస్టు అవధూత నాగానంద్ , మానవ సేవా సంస్థ తరుపున హెచ్. డి ఈరన్న మాజీ ఎమ్మెల్యే ఎం. ఏ గఫూర్, సుందరయ్య స్పూర్తి కేంద్రం చైర్మన్ ప్రభాకర రెడ్డి కి అందజేశారు. అదేవిధంగా ముజఫర్ నగర్, ఇందిరాగాంధీ నగర్, ఉల్చాల గ్రామాలకు చెందిన నిరుద్యోగ యువకులుఅందరూ కలిసి రూ. 3,000/- సుందరయ్య స్పూర్తి కేంద్రం ఐసొలేషన్ సెంటర్ కు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్​ కోవిడ్​ బాధితులను ఆదుకునేందుకు ఆశ్రయ ట్రస్టు అవధూత నాగానంద్​, మానవ సేవా సంస్థ తరుపు హెచ్​.డి. ఈరన్న ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని ఈ సందర్భంగా సుందరయ్య స్పూర్తి కేంద్రం చైర్మన్ ప్రభాకర రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్పూర్తి కేంద్రం కార్యదర్శి గౌస్ దేశాయ్, డైరెక్టర్ రాధాకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె. వి నారాయణ, కె వి పి ఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author