పేదలందరికీ.. పక్కాగృహాలు
1 min read– ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : పేదలందరికీ పక్కా గృహాలు కల్పించడమే జగనన్న లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి మండలం దిగువ అబ్బవరం గ్రామస్థుల కోసం సిబ్యాల రహదారి మార్గంలో ఏర్పాటవుతున్న వైఎస్ఆర్ జగనన్న లే అవుట్ కాలనీ లో భూమిపూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పూరిగుడిసె లేకుండా పేదలందరికీ పక్కా గృహాలు అందించారని, ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ మరో అడుగు ముందుకేసి పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఒక పక్కా గృహ నిర్మాణానికి ప్రభుత్వం రూ 1.80 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని, అందులో బిల్డింగ్ బేస్ మెంట్ లెవల్ అప్పుడు 40 బస్తాలు సిమెంట్, బేస్ మెంట్ లెవల్ పూర్తయితే రూ 35,200 డబ్బులు, మరియు 20 బస్తాల సిమెంట్, రూఫ్ లెవల్ లో రూ 43, 950 లు డబ్బులు మరియు 30 బస్తాల సిమెంట్, రూఫ్ కాంక్రీట్ కు 13,900 డబ్బులు, బిల్డింగ్ పూర్తయితే రూ 36, 700 డబ్బులను చెల్లించడం జరుగుతుందన్నారు. మరియు ట్రాక్టర్ల ఇసుకను కూడా అందచేయడం జరుగుతుందన్నారు. ఇళ్ల పట్టాలు, పక్కా భవనాలు రాని వారికి కూడా అర్హతే ఆధారంగా అందచేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డి, తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి,ఎంపిడిఓ సురేష్ కుమార్, హౌసింగ్ ఈ ఈ శ్రీధర్ రెడ్డి, సర్పంచ్ ప్రభావతమ్మ, ఎంపిటిసి లు ఆంజనేయులు నాయుడు,ప్రభాకర్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, తిరుపాల్ నాయుడు, సహదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.