వినాయక నిమజ్జనం సాఫీగా జరిగేలా చూడాలి… టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మరికొద్ది రోజుల్లో రానున్న వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనంపై కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన నిమజ్జనం అంటేనే నీటితో కూడుకున్నదన్నారు. ప్రస్తుతం కె.సి కెనాల్ లో ఒక చుక్క నీరు లేదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ తర్వాత అంత వైభవంగా కర్నూలు నగరంలోనే వినాయక నిమజ్జనం జరుగుతుందన్నారు. కె.సి కెనాల్ లో నీరు లేకపోవడంతో కర్నూల్లో కొలువుదీరే వేలాది వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయడం ఎలా అన్న ఆందోళన భక్తుల్లో నెలకొందన్నారు. అధికారులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలన్నారు. అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కె.సి కెనాల్ కు నీరు విడుదల చేయించుకొని నిమజ్జనం సాఫీగా జరిగేట్లు చూడాలని భరత్ చెప్పారు. లేదంటే ప్రజల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుందన్నారు.